Begin typing your search above and press return to search.

బ్యాక్ లెస్ ఫోజులో క‌వ్విస్తున్న అందాల‌ వేదిక‌

By:  Tupaki Desk   |   24 Sep 2021 1:30 PM GMT
బ్యాక్ లెస్ ఫోజులో క‌వ్విస్తున్న అందాల‌ వేదిక‌
X
గ‌త కొంత‌కాలంగా అందాల క‌థానాయిక వేదిక సోష‌ల్ మీడియాల్లో ఎంతో యాక్టివ్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే. కొంత గ్యాప్ త‌ర్వాత రీఎంట్రీని ఘ‌నంగా చాటుకునేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉంది. నారా రోహిత్ స‌ర‌స‌న బాణం చిత్రంలో న‌టించిన‌ వేదిక‌ ఆ త‌ర్వాత న‌ట‌సింహా బాల‌కృష్ణ‌ స‌ర‌స‌న రూల‌ర్ లో అవ‌కాశం అందుకుంది. అయితే ఈ న‌వ‌త‌రం బ్యూటీకి ఆశించినంత పెద్ద హిట్లు ద‌క్క‌లేదు. దాంతో వ‌రుస‌ ఆఫ‌ర్లేవీ రాలేదు. మునిలో రాఘ‌వ‌ లారెన్స్ స‌ర‌స‌న ఆడిపాడింది. కానీ అది కూడా క‌లిసిరాలేదు. వేదిక‌ 2019లో ది బాడీ అనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ లో న‌టించింది. ఇందులో హిమేష్ రేష‌మ్మియా.. రిషీ క‌పూర్.. శోభిత‌ ధూళిపాల‌ త‌దిత‌రులు న‌టించారు. కాలం క‌లిసి రాక‌పోయినా.. త‌న ప్ర‌య‌త్నాల్ని మాత్రం విర‌మించ‌లేదు.

లాక్ డౌన్ స‌మ‌యంలో వేదిక‌లో చాలా మార్పులు క‌నిపిస్తున్నాయి. ఇంత‌కుముందులా మ‌డి క‌ట్టుకుని కూచునే ఆలోచ‌న త‌న‌కు లేద‌ని నిరూపిస్తోంది. త‌న‌లో దాగి ఉన్న‌ హాట్ కంటెంట్ ని ఈ బ్యూటీ బ‌య‌ట‌కు తీస్తోంది. ఇన్ స్టాలో వ‌రుస‌ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. ఇప్ప‌టికే వేదిక బోల్డ్ ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో వేడెక్కించాయి. బికినీ బీచ్ ఫోటోషూట్ల‌తోనూ ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది.

తాజాగా స‌న్న‌జాజి తీగ‌లా మారిన ఈ అమ్మ‌డు అలా వీపందం ప్ర‌ద‌ర్శిస్తూ కుర్ర‌కారును కొంటెగా క‌వ్విస్తున్న ఫోటో వైర‌ల్ గా మారింది. తెలుగు త‌మిళంలో ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఈ ట్యాలెంటెడ్ బ్యూటీని పిలిచి అవ‌కాశాలివ్వ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.