చేపల కొలనులో బికినీ మయూరం ఎవరో కనిపెట్టారా?

Fri Nov 20 2020 17:21:52 GMT+0530 (IST)

Video: Vedhika Enjoys Her Spa Time In A Hot Tub!

అదో విశాలమైన కొలను. అందులో చేపలు అటూ ఇటూ ఈదుతూ ఆహారం వెతుక్కుంటున్నాయి. ఇక ఆ కొలనులో మరో బిలం. అందులో ఒక అందాల కన్యక. ఎంతో అందంగా బికినీ ధరించి అటూ ఇటూ చూస్తూ చూపరులను మైమరిపిస్తోంది.ఇక ఆ కొలను నుంచి జూమ్ చేస్తే చుట్టూ అందమైన రిసార్ట్ వెదర్.. దూరంగా సముద్రం కనిపిస్తోంది. మొత్తానికి ఇలాంటి చోట ఎంజాయ్ చేస్తున్న ఆ బికినీ ఫిష్ ఎవరై ఉంటారు? అన్నది ఆరా తీస్తే.. ఇంకెవరు.. ఇటీవల ఉన్నట్టుండి సోషల్ మీడియా వేదికగా చెలరేగుతున్న అందాల వేదిక గురించే ఇదంతా.

నారా రోహిత్ `బాణం` సహా పలు టాలీవుడ్ చిత్రాల్లో నటించిన వేదిక ప్రస్తుతం కెరీర్ పరంగా కొత్త మలుపు కోరుకుంటోంది. ఆ క్రమంలోనే ఇలా సోషల్ మీడియాల్లో అభిమానుల్ని పెంచుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. నిరంతరం వేడెక్కించే స్టింట్ తో ఐ క్యాప్చుర్ గాళ్ గా మారింది. తాజా బికినీ యాక్ట్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.


TAGS: Vedhika