Begin typing your search above and press return to search.

ఆ సినిమాకి పనిచేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు: అల్లు అర్జున్

By:  Tupaki Desk   |   4 Jun 2020 1:30 PM GMT
ఆ సినిమాకి పనిచేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు: అల్లు అర్జున్
X
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క, మనోజ్ బాజపేయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మల్టీస్టారర్ సినిమా ‘వేదం’. 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విమర్శకుల నుండి ప్రశంసలు సైతం దక్కించుకుంది. కేబుల్ ఆపరేటర్ నటించిన అల్లు అర్జున్.. మనిషిగా పుడితే డబ్బున్న వాడిగానే పుట్టాలని భావించే పాత్రలో అటు కామెడీగా ఇటు ఎమోషనల్ గా ఆకట్టుకున్నాడు. ఇక వేశ్యగా నటించిన అనుష్క.. ఆ వృత్తిలో వేశ్యలు ఎదుర్కొనే ఇబ్బందులను.. వారి జీవితాలు ఎలా ఉంటాయో.. ఇలా అనేక విషయాలు అనుష్క‌ పాత్ర ద్వారా ఆవిష్కరించింది. హీరో మనోజ్.. పాప్ స్టార్ కావాల‌నుకునే యువ‌కుడి పాత్ర‌లో మనోజ్ న‌టించ‌గా.. ముస్లిం అని టెర్రరిస్ట్‌గా ముద్ర వేయడం.. అక్కడి నుండి బయటపడి సౌదీ వెళ్లాలనుకునే టైమ్‌లో అరెస్ట్ అయిన పాత్రలో మెప్పించాడు.

ఇలా ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పాత్ర ద్వారా డైరెక్టర్ తన విజన్ చూపించాడు. ఇక ఈ సినిమా 2010లో జూన్ 4న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ రోజుతో ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తి చేసుకున్నందున అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా చిత్రం గురించి స్పందించాడు. 'వేదానికి దశాబ్దం.. ఈ బ్యూటిఫుల్‌ జర్నీలో భాగస్వాములైన వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దర్శకుడు క్రిష్‌కు, నటులు అనుష్క శెట్టి, మంచు మనోజ్, మనోజ్ బాజ్ పాయ్‌కి, ఇతర నటులకు, టెక్నీషియన్లకు, వారిచ్చిన మద్దతుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే, కీరవాణి గారికి, ఆర్కా మీడియాకు ధన్యవాదాలు చెబుతున్నాను' అని ట్వీట్ చేసాడు అల్లు అర్జున్. ఈ సినిమా గురించి నెటిజన్లు కూడా స్పందించడం విశేషం.