బిగ్ బాస్ లో ఆ ఇద్దరు స్టార్ ఆఫ్ ద హౌస్

Thu Oct 10 2019 10:10:45 GMT+0530 (IST)

Varun and Shiva Jyothi Becomes Star of The House in Bigg Boss 3 House

దసరా సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యి కింగ్ నాగార్జున ఓ రేంజ్ లో సందడి చేస్తూ...ఇంటి సభ్యుల చేత ఫన్నీ టాస్కులు చేయించారు. కంటెస్టంట్స్ టాస్క్ ల్లో పోటీపడి మరి చేసి ప్రేక్షకులకు కావల్సినంత వినోదం పంచారు. ఈ వినోదం అయిపోయాక కంటెస్టంట్స్ లో స్టార్ ఆఫ్ ది హౌస్ ఎవరో చెప్పాలని - వాళ్ళకు స్పెషల్ గిఫ్ట్ ఉంటుందని కింగ్ నాగార్జున ప్రకటించారు. అయితే స్టార్ ఆఫ్ ది హౌస్ ని ప్రకటించి...ఎందుకో కూడా కారణాలు చెప్పాలని - ఎవరికి ఎక్కువ స్టార్లు వస్తే - వాళ్ళు స్టార్ ఆఫ్ ది హౌస్ అవుతారని చెప్పారు.దీంతో మొదట ఊహించినట్లుగానే అలీ...శివజ్యోతిని స్టార్ ఆఫ్ ది హౌస్ అని ప్రకటించగా - శివజ్యోతి...అలీకి స్టార్ పెట్టింది. ఆ తర్వాత బాబా భాస్కర్...శ్రీముఖికి స్టార్ పెట్టగా - శ్రీముఖి...బాబా భాస్కర్ ని స్టార్ ఆఫ్ ది హౌస్ గా ప్రకటించింది. అలాగే వితికా...వరుణ్ ని - వరుణ్-వితికాని స్టార్ ఆఫ్ ది హౌస్ లుగా ప్రకటించుకున్నారు. అయితే మహేష్-శివజ్యోతిని స్టార్ ఆఫ్ ది హౌస్ గా ప్రకటించగా - రాహుల్-వరుణ్ పేరు చెప్పాడు. దీంతో రెండేసి స్టార్లు వచ్చిన శివజ్యోతి - వరుణ్ లు స్టార్ ఆఫ్ ది హౌస్ గా ఎంపికయ్యారు.

ఈ వారం మొత్తం వాళ్ళకి స్పెషల్ డిన్నర్ ఉంటుందని నాగార్జున మంచి ఆఫర్ ఇచ్చారు. ఇక ఈ స్టార్ గోల అయిపోయాక కంటెస్టంట్స్ తమ జీవితంలో సాధించిన గొప్ప విజయాలు - మరిచిపోలేని సంఘటలను చెప్పాలని నాగార్జున కోరారు. దీంతో ఎనిమిది మంది సభ్యులు తమ అనుభవాలని పంచుకున్నారు. కొందరు తాము సాధించిన విజయాలను చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యారు.