Begin typing your search above and press return to search.

వీడియో సాంగ్: ఎనర్జిటిక్ పంజాబీ స్టెప్పులతో అదరగొట్టిన వరుణ్ - కియారా..!

By:  Tupaki Desk   |   28 May 2022 1:30 PM GMT
వీడియో సాంగ్: ఎనర్జిటిక్ పంజాబీ స్టెప్పులతో అదరగొట్టిన వరుణ్ - కియారా..!
X
బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ - అందాల భామ కియారా అద్వాణీ జంటగా కలిసి నటించిన తాజా చిత్రం ''జగ్‌ జగ్‌ జీయో''. రాజ్‌ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రముఖ నటులు అనిల్‌ కపూర్‌ - నీతూ కపూర్‌ కీలక పాత్రలు పోషించారు.

పెళ్లి, విడాకులు, సంక్లిష్టమైన బంధాల ఇతివృత్తంగా భార్యాభర్తలు తన వివాహ బంధంలో వచ్చిన ఒడుదొడుకులను ఎదుర్కొని ఎలా ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకున్నారనే నేపథ్యంతో ఎమోషనల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా 'జగ్ జగ్ జీయో' చిత్రాన్ని రూపొందించారు.

2022 జూన్‌ 24న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా పోయిన ఆదివారం రిలీజ్ చేసిన మూవీ ట్రైలర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు తాజాగా 'జగ్‌ జగ్‌ జీయో' సినిమా నుంచి 'నాచ్ పంజాబన్' అనే వీడియో సాంగ్ ని విడుదల చేశారు. ఇందులో వరుణ్ - కియార అద్వానీ ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టారు. ఇద్దరి లుక్స్ - ఎక్స్ ప్రెషన్స్ పెర్ఫెక్ట్ గా ఉన్నాయి. వీరితో పాటుగా అనిల్ కపూర్ - నీతూ కపూర్ సందడి చేశారు.

'నాచ్ పంజాబన్' అనే ఈ పంజాబీ డ్యాన్స్ నంబర్ కు తనీష్ బాగ్చి ట్యూన్ కంపోజ్ చేశారు. అయితే పాకిస్తానీ సింగర్ అబ్రార్ ఉల్ హక్ ఈ పాటపై కాపీ ఆరోపణలు చేయడంతో.. అతనికి కూడా క్రెడిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రిప్పీ గ్రీవల్ - జారా ఖాన్ - తనీష్ బాగ్చి - రోనీ కలిసి ఆలపించారు.

'జగ్‌ జగ్‌ జీయో' సినిమాకి అనురాగ్ సింగ్ స్టోరీ అందించగా.. రిషబ్ శర్మ - సుమిత్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. వాయ్ కామ్ 18 స్టూడియోస్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై యశ్ జోహార్ - కరణ్ జోహార్ - అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇకపోతే గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎలాంటి సినిమా చేసినా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోతున్నాయి. కాకపోతే గత వారం వచ్చిన 'భూల్ బులైయా 2' చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి హిందీ చిత్ర పరిశ్రమకు ఊపిరిపోసింది. ఈ క్రమంలో రాబోతున్న 'జగ్‌ జగ్‌ జీయో' మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.