Begin typing your search above and press return to search.

మెగా భోగి సెలబ్రేషన్స్: వరుణ్ దోస చూసి కుళ్ళుకున్న చిరంజీవి..!

By:  Tupaki Desk   |   14 Jan 2022 5:56 AM GMT
మెగా భోగి సెలబ్రేషన్స్: వరుణ్ దోస చూసి కుళ్ళుకున్న చిరంజీవి..!
X
తెలుగు ప్రజలు 'సంక్రాంతి' ని పెద్ద పండుగగా చెప్పుకుంటారు. సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ళు - కోడి పందాలు - రంగురంగుల ముగ్గులు - గొబ్బెమ్మలు - పిండి వంటలే కాదు.. కొత్త సినిమాలు కూడా. అందుకే సినీ అభిమానులు దీన్ని సినిమా పండుగా అభివర్ణిస్తారు. ఇక ఫెస్టివల్ వచ్చిందంటే సినీ తారలు షూటింగ్ లకి బ్రేక్ ఇచ్చి పనులన్నీ పక్కన పెట్టేసి సొంత గూటికి వాలిపోతుంటారు.. కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేషన్స్ జరుపుకుంటుంటారు.

ఏ పండుగ వచ్చినా మెగా ఫ్యామిలీలో ప్రత్యేకంగా వేడుకలు నిర్వహిస్తుంటారనే సంగతి తెలిసిందే. ఎంత బిజీగా ఉన్నా అందరూ ఒకచోట చేరి సెలబ్రేట్ చేసుకుంటారు. కుటుంబ పెద్ద అయిన మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతుంటాయి. నేడు భోగి పండుగను కూడా అదే విధంగా హైదరాబాద్‌ లోని తన ఇంట్లో జరుపుకుంటున్నారు చిరు. ఉదయాన్నే భోగి మంటలు వేయడమే కాదు.. వరుణ్ తేజ్ తో కలిసి దోసెలు వేసి మిగతా సభ్యులకు అందిస్తున్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లో మెగా ఫ్యామిలీ భోగి సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోని షేర్ చేసారు. ఇందులో చిరంజీవితో కలిసి వరుణ్ దోసెలు చేయడం మనం చూడవచ్చు. అయితే వరుణ్ దోసె బాగా వచ్చింది.. చిరు దోసె సరిగ్గా రాలేదు. దీంతో వెంటనే వరుణ్ వేసిన దోసెను చెడగొట్టాడు చిరు. ''వాడిది బాగా వచ్చింది.. నాది సరిగ్గా రాలేదు.. నాకు కుళ్ళు వచ్చేసింది'' అంటూ చిరంజీవి ఫన్నీగా మాట్లాడుతూ అందరినీ నవ్వించడం కనిపిస్తుంది.

ఇందులో చిరంజీవి తల్లి అంజనీ దేవితో పాటుగా నాగబాబు దంపతులు - మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్ మరియు పంజా వైష్ణవ్ తేజ్ - మెగా డాటర్ నిహారికను చూడవచ్చు. ఈ ఇన్స్టా రీల్ ని అభిమానులతో పంచుకున్న వరుణ్ తేజ్.. “బాస్ చిరంజీవితో దోస మేకింగ్ 101.. 2022 భోగి” అని క్యాప్షన్ పెట్టారు. మెగా ఫ్యామిలీ భోగి వేడుకల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.