వివాదాల విషయంలో తండ్రి బాటలోనే నడుస్తున్న వరుణ్ తేజ్...?

Fri May 29 2020 12:00:02 GMT+0530 (IST)

Varun Tej Following His Father Footsteps In Controversey

మెగా హీరో వరుణ్ తేజ్ కూడా వివాదాల విషయంలో తండ్రి బాటలోనే నడుస్తున్నదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిన్నటి నుండి సినీ ఇండస్ట్రీలో బాలయ్య - నాగబాబు వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమకు సంబందించిన కొన్ని కీలక సమావేశాలకు తనని ఆహ్వానించడం లేదని ఎన్టీఆర్ జయంతి సంధర్భంగా మీడియా ముందుకు వచ్చిన బాలకృష్ణ పెద్ద బాంబ్ పేల్చారు. అలాగే మంత్రి తలసానితో కలిసి వీరు భూములు పంచుకుంటున్నారా అని బాలయ్య వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది. ఆయన తాజా వ్యాఖ్యలు టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. బాలయ్య నోటిని అదుపులో పెట్టుకోవాలని.. సీనియర్ నటుడైన బాలకృష్ణ ఇలా అర్థంలేని విధంగా మాట్లాడం సరికాదని.. సినీ ఇండస్ట్రీనే కాకుండా తెలంగాణా ప్రభుత్వాన్ని కూడా బాలయ్య అవమానించేలా  ఉన్న ఆ వ్యాఖ్యలు బాలయ్య వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ నేపథ్యంలో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సోషల్ మీడియా మాధ్యమాలలో పెట్టిన ఒక పోస్ట్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు.వరుణ్ తేజ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో 'గడ్డలకొండ గణేష్' సినిమాలోని పోస్టర్ జత చేస్తూ ''చేతిలో తుపాకీ పట్టుకొని ఉండే మనిషితో ఎవరూ మాట్లాడలేరు'' అంటూ కామెంట్ పెట్టాడు. ఇప్పడు వరుణ్ తేజ్ చేసిన ఈ పోస్ట్ ఇండైరెక్ట్ గా బాలయ్యని టార్గెట్ చేసి పెట్టాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో బాలయ్య - నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇష్యూని పరోక్షంగా ప్రస్తావించాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం తన సినిమా పోస్టర్ పోస్ట్ చేస్తే తప్పేముంది అంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో వరుణ్ తేజ్ పోస్ట్ ఎవరినో టార్గెట్ చేయడానికే అనే అనుమానం రాకమానదు. నిజానికి సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న వివాదంపై జూనియర్ హీరోలందరూ సైలెంట్ గా ఉన్నారు. మెగా హీరో రామ్ చరణ్ సైతం ఎలాంటి బాలయ్య వ్యాఖ్యలపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే వరుణ్ తేజ్ మాత్రం ఇలా ఇండైరెక్ట్ గా బాలయ్యని టార్గెట్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. రామ్ చరణ్ లా కూల్ గా ఉండకుండా ఇలా పెద్దల వ్యవహారాల్లో తల దూరుస్తూ వివాదాలను పెద్దవి చేసేలా అతని వ్యవహార శైలి ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గొడవలు సర్దుమణిగేలా చూడాలే కానీ ఇలా వాటికి ఆజ్యం పోసేలా ఉండకూడదని వరుణ్ తేజ్ కి సోషల్ మీడియా వేదికగా సలహా ఇస్తున్నారు. తండ్రి నాగబాబు వలె ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వివాదాస్పద పోస్టులు పెడుతూ ఆయన బాటలోనే నడవద్దంటూ నెజిజన్స్ అభిప్రాయపడుతున్నారు.