Begin typing your search above and press return to search.

మెగా హీరో మరో ప్రయోగానికి సిద్ధం!

By:  Tupaki Desk   |   8 Oct 2019 2:30 PM GMT
మెగా హీరో మరో ప్రయోగానికి సిద్ధం!
X
మెగాహీరో వరుణ్ తేజ్ రీసెంట్ గా 'వాల్మీకి' చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. సినిమా కలెక్షన్స్ యావరేజ్ అయినప్పటికీ వరుణ్ తన మేకోవర్ తో మాస్ యాక్టింగ్ తో అందరికీ ఇంప్రెస్ చేశాడు. 'వాల్మీకి' సంగతి సరే.. వరుణ్ నటించే నెక్స్ట్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం వరుణ్ ఒక స్పోర్ట్స్ డ్రామా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

వరుణ్ గత ఏడాది నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాకోసం వరుణ్ రెండు నెలల పాటు అమెరికాలో బాక్సింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అయితే ఆ సమయంలో హరీష్ శంకర్ 'వాల్మీకి' తో ముందుకు రావడంతో ఈ స్పోర్ట్స్ డ్రామా ను పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమానే పట్టాలెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమాతో అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ నిర్మాతగా మారనున్నాడు. గీతా ఆర్ట్స్ కాకుండా తనకంటూ సొంత బ్యానర్ పై ఈ సినిమాను అల్లు బాబీ నిర్మిస్తారని సమాచారం.

ఈ సినిమాను అక్టోబర్ 10 వ తారీఖున లాంచ్ చేస్తున్నారట. ఇది కాన్సెప్ట్ బేస్డ్ సినిమా కాబట్టి ఎక్కువ రిస్క్ లేకుండా లిమిటెడ్ బడ్జెట్లో పూర్తి చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారట. సో.. 'వాల్మీకి' తర్వాత మెగా ప్రిన్స్ మరో ప్రయోగానికి సిద్ధం అన్నమాట.