Begin typing your search above and press return to search.

మైకేల్ తో వరుణ్ సందేశ్ ఫేట్ మారుతుందా?

By:  Tupaki Desk   |   30 Jan 2023 8:00 AM GMT
మైకేల్ తో వరుణ్ సందేశ్ ఫేట్ మారుతుందా?
X
సందీప్ కిషన్ హీరోగా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం మైఖేల్. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా పీరియాడిక్ జోనర్ లో ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో నెగిటివ్ హీరోయిజాన్ని దర్శకుడు ఎలివేట్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన మైకేల్ మూవీ ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకుంది. మొదటిసారి సందీప్ కిషన్ ఈ సినిమాలో పవర్ ఫుల్ రోల్ ని పోషించబోతున్నాడు. ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోయే యువకుడిగా అతని పాత్ర ఉండబోతుంది.

ఇక ఈ సినిమాలో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ పాత్రలో వరుణ్ సందేశ్ కనిపించబోతున్నాడు. హ్యాపీడేస్, కొత్త బంగారులోకం హిట్స్ తర్వాత ఒక్కసారిగా లైన్ లైట్ లోకి వచ్చిన వరుణ్ సందేశ్ తరువాత సరైన స్టోరీ సెలక్షన్ లేకపోవడం వల్ల వరుసగా ఫ్లాప్ లు సొంతం చేసుకొని ఫేడౌట్ అయిపోయాడు. దీంతో కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చి అమెరికా వెళ్లి సెటిల్ అయ్యాడు.

అయితే మరల బిగ్ బాస్ రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేసి అందరి ముందుకు వచ్చారు.ఆ తర్వాత ఇందువదన అనే సినిమా చేసినా కూడా అది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు కాస్త కెరియర్ లో హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వైపు టర్న్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే సందీప్ కిషన్ మైకేల్ సినిమాలో ఓ కీలక పాత్రలో వరుణ్ సందేశ్ నటించబోతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతుండడంతో తెలుగు, తమిళ భాషల్లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మకంతో హీరో సందీప్ కిషన్ ఉన్నాడు. అలాగే మైఖేల్ మూవీతో మళ్లీ నటుడిగా తన ఫేట్ మారుతుందని వరుణ్ సందేశ్ కూడా భావిస్తున్నాడు. అయితే ఇప్పటికే వచ్చిన ట్రైలర్ చూస్తే వరుణ్ సందేశ్ పాత్రకి అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత లేదని అనిపిస్తుంది. మరి ఇలాంటి పాత్రతో వరుణ్ సందేశ్ తిరిగి ఎట్లా బౌన్స్ బ్యాక్ అవుతాడు అనేది వేచి చూడాలి.