Begin typing your search above and press return to search.

వరుణ్ ధావన్ కారుకు యాక్సిడెంట్!

By:  Tupaki Desk   |   24 Jan 2021 6:00 AM GMT
వరుణ్ ధావన్ కారుకు యాక్సిడెంట్!
X
బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ బ్యాచిల‌ర్ లైఫ్ కు గుడ్ బై చెప్ప‌బోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్ ను ఈ రోజు (జనవరి 24) వివాహం చేసుకోనున్నాడు వ‌రుణ్‌. ఈ వేడుక అలీబాగ్‌లోని మాన్షన్ హౌస్‌లో జ‌ర‌గ‌నుంది. వీరి వివాహం కోసం ఇరువురి కుటుంబ స‌భ్యులూ ముందుగానే అక్క‌డికి చేరుకున్నారు.

అయితే.. తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. అలీబాగ్ లో వ‌రుణ్ ధావ‌న్ కారు చిన్న యాక్సిడెంట్ కు గురైన‌ట్టు తెలుస్తోంది. శ‌నివారం రాత్రి నుండి ఈ వార్త‌ వైరల్ అయ్యింది. అయితే.. ఈ ప్ర‌మాదంలో వ‌రుణ్ కు ఎలాంటి గాయాలూ కాలేద‌ని తెలుస్తోంది.

అలీబాగ్ లోని వివాహ వేదిక సమీపంలో స్నేహితులు నిర్వహించిన బ్యాచిలర్ పార్టీకి వెళ్తుండ‌గా.. ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. ఈ ప్ర‌మాదం ఎలా జ‌రిగింది అనే విష‌యం మాత్రం బ‌య‌ట‌కు రాలేదు. కానీ.. ఈ ఘ‌ట‌న‌లో ఎవ్వ‌రూ గాయ‌ప‌డ‌క‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.

కాగా.. COVID-19 కారణంగా వరుణ్-నటాషా వివాహానికి వారి దగ్గరి బంధువులను, స్నేహితులను మాత్రమే ఆహ్వానించారు. కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో వైవాహిక జీవితంలో అడుగు పెడుతున్న వరుణ్‌.. ఆ త‌ర్వాత రిసెప్ష‌న్ ఏర్పాటు చేయ‌నున్నారు. పెళ్లి త‌ర్వాత‌ త్వరలోనే ముంబైలో బాలీవుడ్ ఫొల్క్స్ కోసం గ్రాండ్ లో వీరి రిసెప్షన్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.