Begin typing your search above and press return to search.

అందుకే నైటీ అంటే నాకిష్టం: దీపిక పదుకోనె

By:  Tupaki Desk   |   24 March 2020 3:30 AM GMT
అందుకే నైటీ అంటే నాకిష్టం: దీపిక పదుకోనె
X
కరోనా వైరస్ వలన కర్ఫ్యూ విధించడం కొన్నిసార్లు మంచిదే అన్పిస్తుంది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల గురించి తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ముఖ్యంగా అభిమాన హీరోలు - హీరోయిన్ల విషయాల కోసమైతే తెగ ఆరాటపడిపోతుంటారు. అలాంటి ఒక ఇన్సిడెంట్ బాలీవుడ్ తారలు దీపిక పదుకోనె - యంగ్ హీరో వరుణ్ ధావన్ ల మధ్య చాటింగ్ రూపంలో జరిగింది.

జనతా కర్ఫ్యూ సందర్బంగా ఇంట్లో ఉండిపోయిన సెలబ్రిటీలంతా ఇళ్లను చక్కబెట్టుకొనే పనిలో పడ్డారు. ఇక దీపిక పదుకోనె - వరుణ్ ధావన్ లు ఇంటి పనులతో పాటు వాట్స్ యాప్ లో చాటింగ్ కూడా చేశారట. చాటింగ్ లో భాగంగా వరుణ్ ధావన్ - దీపికకు కొన్ని చిలిపి ప్రశ్నలను సంధించాడు. ఏం చేస్తున్నావ్? అంటే చాలాకాలం తర్వాత కర్ఫ్యూ రూపంలో ఖాళీ టైం దొరికింది కదా.. నా బీరువాలో బట్టలు సర్దుకుంటున్నా అని చెప్పిందట. ఆ వెంటనే వరుణ్.. చిలిపిగా.. నువ్వెప్పుడూ నైట్ డ్రెస్ లోనే ఉంటావ్ ఎందుకని? అన్నాడట. దానికి బదులుగా.. నాకు నైట్ డ్రెస్ లో ఉండటమే చాలా ఇష్టం. చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఎనీటైమ్ ఏ పనైనా చేయొచ్చు.. అంటూ మరింత చిలిపిగా జవాబిచ్చిందట. ఇదేంటి వీళ్లు ఇలా మాట్లాడుకున్నారు అనుకుంటే పొరపాటే.. వాళ్ళిద్దరి మధ్య స్నేహం అలాంటిది మరి. కలిసి నటించకపోయిన మా మధ్య మంచి స్నేహం ఉందంటున్నారు.. ఈ సంభాషణలు అభిమానులకు కూడా ఎంతో విందును పంచుతున్నాయి..