Begin typing your search above and press return to search.

కుర్ర హీరో `లైఫ్ లాంగ్ లవ్`.. నేటి నుంచి అధికారికం

By:  Tupaki Desk   |   25 Jan 2021 4:18 AM GMT
కుర్ర హీరో `లైఫ్ లాంగ్ లవ్`.. నేటి నుంచి అధికారికం
X
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఆదివారం తన చిరకాల ఫ్యాషన్ డిజైనర్ కం ప్రియురాలు నటాషా దలాల్ ని పెళ్లాడారు. ఈ వివాహం ముంబై-అలీబాగ్ లోని మాన్షన్ హౌస్ రిసార్ట్ లో ఒక ప్రైవేట్ వ్యవహారంగా జ‌రిగింది. ఇరు కుటుంబ సభ్యులు.. సన్నిహితులు.. కొద్దిమంది అతిథుల స‌మ‌క్షంలో పెళ్లి వేడుక ఘ‌నంగా సాగింది.

త‌న ప్రేయ‌సిని పెళ్లాడిన వెంట‌నే ఎంతో ఆనందంగా ధావన్ వివాహ వేడుకల నుండి ఫోటోల్ని షేర్ చేశారు. వ‌రుణ్ ధావ‌న్ ఇన్ స్టాలో పెళ్లి ఆల్బ‌మ్ రిజిస్ట‌ర్ అయ్యింద‌నే చెప్పాలి. ``లైఫ్ లాంగ్ లవ్.. ఇప్పుడే అధికారికమైంది`` అంటూ హార్ట్ ఈమోజీని అత‌డు జోడించారు.

హిందూ సాంప్ర‌దాయ విధానంలో ఈ పెళ్లి జ‌రిగింది. పవిత్రమైన అగ్ని దేవుని చుట్టూ ఏడు రౌండ్లు తిరుగుతూ హిందూ వివాహ కర్మను ఆచ‌రించారు ధావ‌న్- న‌టాషా జంట‌. వారి కుటుంబాలు పూల షవర్ తో ఆశీర్వదిస్తున్న వేరొక ఫోటో కూడా వైర‌ల్ అవుతోంది. కొత్త జంట పెళ్లి దుస్తుల్లో ఆభ‌ర‌ణాల‌తో త‌ళుకుబెళుకులు వేదిక వ‌ద్ద హైలైట్ గా నిలిచాయని ఫోటోలు చెప్ప‌క‌నే చెబుతున్నాయి.