ఫ్యాన్ బుగ్గ కొరికిన యాంకర్

Sat Dec 07 2019 11:30:12 GMT+0530 (IST)

Varshini Bite His Fan Cheek

రోటీన్ కు భిన్నంగా చేస్తే కచ్ఛితంగా అదో సంచలనమే. సెలబ్రిటీలు కావాలనుకున్నోళ్లు.. నలుగురి నోట్లో నానేందుకు ఏదో ఒక ఇష్యూ కావాలి. అనుకోకుండా ఇష్యూలు వచ్చేసి ఫేం రావటం ఒక ఎత్తు.. ఎంతకూ రాని ఫేమ్ ను చెత్త చేష్టలతో కొని తెచ్చుకోవటం మరో ఎత్తు. తాజా యవ్వారం చూస్తే ఇలాంటిదే ఒకటి కనిపిస్తుంది.క్రేజ్ కోసం దేనికైనా రెఢీ అన్నట్లు వ్యవహరిస్తున్నారు యాంకర్లు అన్న మాటను నిజం చేసి తాజా సంచలన యాంకర్ గా మారింది వర్షిణి. ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన ఈ పొడుగు సుందరి.. ప్రేక్షకుల్లో తన ముద్ర వేసేందుకు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. తెలుగులో టాప్ యాంకర్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో క్రేజ్ తెచ్చుకునేందుకు టాలెంట్ కంటే అంతకు మించిన పనిని ఎంచుకుందీ భామ.

తాజాగా ఆమె చేసిన చిలిపి పని విమర్శలతో పాటు సంచలనానికి తెర తీసింది. పటాస్ షోలో ఆరాచకం లాంటి పని చేసేసింది. గుర్తింపు కోసం చేసిన చెత్త పనిగా పలువురు అభివర్ణిస్తున్న ఈ వ్యవహారంలోకి వెళితే.. పటాస్ షోకు కొత్త యాంకర్ గా వచ్చాడు చంటి. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అందులో షో జరుగుతున్నప్పుడు మాట్లాడేందుకు మైక్ తీసుకున్న అభిమానిని చూసి.. చాలా ముద్దుస్తున్నాడే.. రా.. అంటూ ఆ కుర్రాడ్ని స్టేజ్ మీదకు పిలుస్తుంది వర్షిణి.

స్టేజ్ మీదకు వచ్చిన ఆ టీనేజర్ బుగ్గల్ని సాగదీయటమే కాదు.. చప్పున బుగ్గను కొరికేయటం సంచలనంగా మారింది. యాంకర్ చేసిన పనికి ఆ కుర్రాడు సిగ్గు పడిపోయాడు. దీన్ని చూసిన వారంతా షాక్ తిన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే.. షోను మరింత రక్తి కట్టించేందుకే ఇలాంటి పని చేశారా? అన్న సందేహం కలుగక మానదు.  

కుర్రాడు ఎంత ముద్దు వస్తే మాత్రం.. స్టేజ్ మీదకు పిలిచి.. బుగ్గలు సాగదీసి.. అంతలా కొరికేయాల్సిన అవసరం ఉందా? అని మండిపడుతున్నారు. ఎంత క్రేజ్ తెచ్చుకోవాలంటే మాత్రం.. మరీ ఇంతలా పిచ్చి పని చేయాల్సిన అవసరం ఉందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.