''అల్లు'' అనే కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన వర్మ...!

Sun Aug 02 2020 12:20:55 GMT+0530 (IST)

Varma announces controversial project Allu

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అందరూ ఊహించినట్లే మరో  కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. కరోనా టైంలో సినీ ఇండస్ట్రీ మూతపడినా ఆర్జీవీ కంపెనీ మాత్రం క్లోజ్ అవలేదు. కరోనా మహమ్మారిని కూడా లెక్క చేయకుండా వరుసపెట్టి సినిమాలు తీస్తున్నారు ఆర్జీవీ. ఈ క్రమంలో ఇప్పటికే ''క్లైమాక్స్'' ''నగ్నం'' ''పవర్ స్టార్'' అనే సినిమాలను ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజ్ చేసిన రామ్ గోపాల్ వర్మ ''మర్డర్'' ''థ్రిల్లర్'' అనే మరో రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ చేసారు. ఈ క్రమంలో ఇటీవల ఫిక్షనల్ రియాలిటీ(FR) అనే కొత్త జోనర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ''ఆర్జీవీ మిస్సింగ్'' అనే సినిమా ప్రకటించారు. ఈ సినిమాలో నటిస్తున్న నటులు అంటూ కొన్ని పేర్లు ప్రకటించి సంచలనం రేపాడు. ఈ క్రమంలో తాజాగా ''అల్లు'' అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు వర్మ. ఈ సినిమా కూడా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో ఫిక్షనల్ రియాలిటీ జోనర్ లో రాబోతుందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.కాగా ''అల్లు'' అనే సినిమా ఓ పెద్ద స్టార్ హీరో కుటుంబానికి వెనుక నుండి ఓ బామ్మర్ది ఏమి చేసాడు అనే ఫిక్షనల్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనుంది.. ఆ స్టార్ హీరో “జన రాజ్యం” పార్టీని ప్రకటించిన తర్వాత స్టోరీ మొదలవుతుందని చెప్పుకొచ్చాడు. వర్మ ఇంకా ఈ సినిమా గురించి చెప్తూ.. “అల్లు” అనే టైటిల్ పెట్టడానికి ప్రధాన కారణం ఇందులోని మెయిన్ క్యారెక్టర్ రకరకాల ప్లాన్స్ “అల్లు”తూ వుంటాడు. 'తనకి మంచి జరగాలి అంటే ప్లాన్ అల్లు.. మరొకడికి చెడు జరగాలి అంటే ప్లాన్ అల్లు' అనే స్ట్రాటర్జీ తో ప్లాన్ లు అల్లుడు లో ఆరితేరిపోయి.. పెద్ద స్టార్ అయిన తన బావ పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండటానికి తమ ఇంటి “అల్లు”డు అని కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్లు అల్లుతూ వుంటాడు. అందరితో తనని "ఆహా" అనిపించుకోవటానికి తనకి కావాల్సిన వాళ్ళకే మంచి జరిగేలా చెప్పి ప్లాన్ ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ "అల్లు" అని పేర్కొన్నాడు.

ఇక ఈ సినిమాలో A Aaravind - K Chiraaanjeevi - Prawan Kalyan - A Aaarjun - A Sheeresh - K R Chraran - N Baebu తదితరులు నటిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ''కొందరు రియాలిటీలో ఆలోచిస్తున్నట్లుగా “అల్లు” అనేది కల్పిత రహిత చిత్రం కాదు. నన్ను 'నికృష్టుడు' అని పిలిచినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి నేను ఈ సినిమా చేయడం లేదు. నేను ఆ కుటుంబంపై ఉన్న నా ప్రేమపై తెలియజేయడానికి చేస్తున్నానని ప్రమాణం చేస్తున్నాను. ''అల్లు''లో థియేటర్ మాఫియా ఉండదు పార్టీ టిక్కెట్లు అమ్మడం సోదరుల మధ్య సమస్యలు ఉండవు అని నేను చెప్పడం లేదు'' అని వర్మ ట్వీట్ చేసారు. ఇప్పటి వరకు ''ప్రజారాజ్యంలో బావరాజ్యం'' అనే సినిమా ఆర్జీవీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ''అల్లు'' అనే సినిమా అనౌన్స్ చేసి మరోసారి ఇండస్ట్రీలో సంచలం రేపాడు.