వర్మకు దొరికిన మరో ‘అప్సర’స

Mon Jul 06 2020 20:30:34 GMT+0530 (IST)

Varma Found Another Apsara

ఇన్ని రోజులు రామ్ గోపాల్ వర్మ క్రియేటివిటీకి వివాదాలు.. సెన్సార్.. థియేటర్లు అడ్డు వచ్చేవి. ఎప్పుడైతే డిజిటల్ ప్రపంచం మొదలైందో అప్పటి నుండి వర్మ రెచ్చి పోతున్నాడు. తన క్రియేటివిటీకి మరింత పదును పెడుతున్నాడు. వర్మ చేస్తున్న సినిమాలు రచ్చ రచ్చగా ఉన్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎనీ టైమ్ థియేటర్ ను వర్మ ఆరంభించి ఇప్పటికే క్లైమాక్స్ మరియు నగ్నం సినిమాలు చేసిన వర్మ ముందు ముందు మరిన్ని సినిమాలను తీసే అవకాశం ఉంది.తాజాగా కొత్త సినిమా హీరోయిన్ ను వర్మ పరిచయం చేశాడు. ఒడిశాకు చెందిన అప్సర రాణి అనే యువతిని తన కొత్త సినిమా హీరోయిన్ గా పేర్కొంటూ సోషల్ మీడియా ద్వారా వరుస ట్వీట్స్ చేశాడు. శ్రీ రాపాకను హీరోయిన్ గా పరిచయం చేసి ఆమెను ఓవర్ నైట్ లో సెలబ్రెటీని చేసిన వర్మ ఇప్పుడు అప్సర ను హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

ఇప్పటికే ఈమె రెండు తెలుగు సినిమాల్లో నటించింది. కాని ఇండస్ట్రీలో కూడా ఈమె చాలా మందికి తెలియనే తెలియదు. అలాంటి అప్సర వర్మ చేతిలో పడటంతో ఓవర్ నైట్ స్టార్ అవ్వబోతుందంటున్నారు. ఇంకా సినిమాలో నటించకుండానే వర్మ ట్వీట్ తో అప్సర గురించి అందరికి తెలిసి పోయింది. ఆమె గురించి మరింతగా తెలుసుకునేందుకు జనాలు ఉబలాట పడుతున్నారు.

రామ్ గోపాల్ వర్మ క్రియేటివిటీకి హద్దు అదుపు లేకుండా పోయింది. ఆయన క్రియేటివిటీతో బూతు సినిమాలు తీస్తూ కొత్త కొత్త ముద్దుగుమ్మలను పరిచయం చేస్తున్నాడు. బాలీవుడ్ టాలీవుడ్ ల్లో పలువురు హీరోయిన్స్ ను పరిచయం చేసిన వర్మ అప్సరస లాంటి మరో హీరోయిన్ ను తెలుగు వారికి పరిచయం చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు.

ఇంత అందంను ఇన్నాళ్లు చూడకుండా ఉన్నందుకు ఫీల్ అవుతున్నాను అంటూ వర్మ ఆమెపై మరింతగా జనాల ఫోకస్ పడేలా చేస్తున్నాడు. ఆమెతో థ్రిల్లర్ అనే సినిమాను చేస్తాడట. అప్సరకు ఎక్కడ కెమెరా పెడతావు బాబు అంటూ నెటిజన్స్ వర్మను ప్రశ్నిస్తున్నారు.