కోలీవుడ్ హీరోయిన్ క్లిక్ అవుతుందా ?

Thu Nov 14 2019 20:00:02 GMT+0530 (IST)

Varalakshmi in Tenali Ramakrishna BABL

ఇప్పటికే కన్నడ మళయాలం లో నటించిన శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి ప్రస్తుతం కోలీవుడ్ లో అడపాదడపా నెగిటీవ్ క్యారెక్టర్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇప్పుడీ బ్యాడ్ హీరోయిన్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే సందీప్ కిషన్ 'తెనాలి రామకృష్ణ BABL' సినిమాలో నటించిన ఈ భామ లేటెస్ట్ గా రవి తేజ -గోపీచంద్ మలినేని సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.వరలక్ష్మి 'పందెం కోడి''సర్కార్' వంటి డబ్బింగ్ సినిమాలతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ లో కూడా సక్సెస్ ఫుల్ లేడీ విలన్ అనిపించుకోవాలని చూస్తుంది.

నిజానికి తెలుగులో లేడీ విలన్స్ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. తెలంగాణా శకుంతల వంటి ఒకరిద్దరు మాత్రమే సక్సెస్ అయ్యారు. మరి ఆ కోవలోకి వరలక్ష్మి వెళ్తుందా చూడాలి. ఈ అమ్మడు నటించిన మొదటి తెలుగు సినిమా 'తెనాలి రామకృష్ణ BABL'రేపే రిలీజవుతుంది. మరి ఈ సినిమాలో తన నటనతో ఎలాంటి మార్కులు అందుకుంటుందో ?