యశోదపై జయమ్మ ఎమోషనల్ నోట్

Mon Jun 27 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Varalakshmi Sarath Kumar On Yashoda Movie

మొదట రెగ్యులర్ హీరోయిన్ గా నటించి ఆ తర్వాత మళ్లీ లేడి విలన్ గా మారిపోయిన వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు సినిమాలకు అవసరమయ్యే పవర్ఫుల్ పాత్రల్లో కూడా నటిస్తోంది. దాదాపు హీరోలతో సమానంగా క్రేజ్ అందుకుంటున్న వరలక్ష్మి అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది.ముఖ్యంగా క్రాక్ సినిమాతో జయమ్మ గా మంచి క్రేజ్ అందుకున్న ఈ సీనియర్ నటి రాబోయే సినిమాలతో అంతకుమించి అనేలా ఆకట్టుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ చేతిలో చాలా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ యశోద కూడా ఉంది. విభిన్నమైన థ్రిల్లర్ డ్రామాగా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న యశోద సినిమాలో వరలక్ష్మి కూడా పవర్ ఫుల్ పాత్రలో హైలెట్ కాబోతున్నట్లు గా తెలుస్తోంది.

సినిమాకు ట్విస్ట్ ఇచ్చి పాత్రల్లోనే ఆమె అద్భుతమైన నటనతో ఆకట్టుకోబోతున్నట్లు చిత్రయూనిట్ ఇదివరకే ఒకసారి క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని వరలక్ష్మి సోషల్ మీడియా ద్వారా వివరణ ఇవ్వడం విశేషం. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్న ఆమె ఇలాంటి చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా వర్క్ చేశారు అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ఇక సినిమాలో తనకు అవకాశం ఇచ్చినందుకు చిత్ర యూనిట్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఆమె ఈ సినిమాలో వెండితెరపై చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా తెలియజేసింది. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ మరోవైపు గోపీచంద్ మలినేని నందమూరి బాలకృష్ణ కలయికలో రానున్న మాస్ యాక్షన్ సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. అలాగే మరి కొన్ని పెద్ద సినిమాలలో కూడా ఆమె విభిన్నమైన పాత్రల్లో ఆకట్టుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.