Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు బిగ్ స్టార్ ల‌తో వంశీ పైడిప‌ల్లి మ‌ల్టీస్టార‌ర్‌?

By:  Tupaki Desk   |   8 Dec 2021 11:35 AM GMT
ఇద్ద‌రు బిగ్ స్టార్ ల‌తో వంశీ పైడిప‌ల్లి మ‌ల్టీస్టార‌ర్‌?
X
టాలీవుడ్ నుంచి వ‌స్తున్న మెగా మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్‌`. ఈ సినిమా కొత్త స‌మీక‌ర‌ణ‌ల‌కు.. కొత్త త‌ర‌హా మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కు శ్రీ‌కారం చుట్ట‌డ‌మే కాకుండా మాన‌సిక ధైర్యాన్నిచ్చింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఇద్ద‌రు స్టార్ హీరోల‌ని పెట్టి వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో మ‌ల్టీస్టార‌ర్ చేయాలంటే ఇంత‌కు ముందు నిర్మాత‌లు వామ్మో మా వ‌ల్ల కాదంటూ జంకే వారు. కానీ `బాహుబ‌లి` సిరీస్‌తో పాటు `ఆర్ ఆర్ ఆర్‌` తో ఆ భ‌యాలన్నీ మ‌టుమాయం అయ్యాయి.

తెలుగు సినిమా మార్కెట్ స్థాయి పెరిగింది. వ‌ర‌ల్డ్ సినిమాతో పోటీప‌డుతోంది. బాలీవుడ్ వ‌ర్గాలే తెలుగులో మ‌న వాళ్లు ఓ సినిమాని అనౌన్స్ చేయ‌గానే దాన్ని తాము ఎలా మార్కెట్ చేసుకోవాలా అని ఆలోచన‌లో పడి రైట్స్ కోసం పోటీప‌డే స్థాయికి చేరుకుంది. ఈ నేప‌థ్యంలో తాజా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని స్టార్ డైరెక్ట‌ర్స్ స్టార్ హీరోల‌తో భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు.

`ఆర్ ఆర్ ఆర్‌` ని స్ఫూర్తిగా తీసుకుని మ‌రో ఇద్ద‌రు క్రేజీ హీరోల‌తో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీని ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ప్లాన్ చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కోసం త‌న‌కు అత్యంత స‌న్నిహితులైన ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ మ‌హేష్ బాబు, రామ్ చ‌ర‌ణ్ లని రంగంలోకి దింపేస్తున్నార‌ట‌. గ‌తంలో ఈ ఇద్ద‌రిలో వంశీ పైడిప‌ల్లి సూప‌ర్ హిట్ చిత్రాల‌ని అందించిన విష‌యం తెలిసిందే.

ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ ని మాస్ట‌ర్ మైండ్ అల్లు అర‌వింద్ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టుగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అయితే కొంత మంది మాత్రం ఇది ఓ రూమ‌ర్ మాత్ర‌మే న‌ని కొట్టి ప‌డేస్తున్నారు. ఇదే గ‌న‌క నిజ‌మైతే బాలీవుడ్ త‌ర‌హాలో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల‌కు టాలీవుడ్ కూడా కేరాఫ్ అడ్ర‌స్ గా మార‌డం కాయం అని అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.