'హ్యాట్రిక్' సినిమా దిశగా వాలిమై కాంబినేషన్..?

Thu Jun 17 2021 09:00:02 GMT+0530 (IST)

Valimai combination towards Hatrick movie

తమిళ స్టార్ హీరో అజిత్.. సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులందరికి సుపరిచితమే. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న అజిత్ ప్రస్తుతం ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారి స్టోరీతో సన్నద్ధం అవుతున్నాడు. ఇదివరకు స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వరుసగా నాలుగు హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. చివరిగా 2019లో హిందీ పింక్ మూవీ రీమేక్ 'నిర్కొండ పార్వై' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇటీవలే పింక్ మూవీ తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ అయింది. ఇదిలా ఉండగా.. నిర్కొండ పార్వై ఫేమ్ హెచ్.వినోద్ దర్శకత్వంలోనే అజిత్ సెకండ్ మూవీ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రూపొందించే ప్లాన్ లో ఉన్నారట దర్శక నిర్మాతలు. 'వాలిమై' పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రముఖ ప్రొడ్యూసర్ బోనీకపూర్ నిర్మిస్తుండగా.. హ్యూమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తుంది. లాక్డౌన్ ముందు వరకు హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇండియా మూవీగా తమిళ తెలుగు హిందీ బాషలలో ఈ సినిమా విడుదల కాబోతుందని అంటున్నారు. ఇక తెలుగు యంగ్ హీరో కార్తికేయ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

అయితే హెచ్.వినోద్ ఎంతటి ప్రతిభ గల దర్శకుడో అతని సినిమాలు చూస్తే అర్ధమవుతుంది. తెలుగులో కూడా హిట్ అయినటువంటి బ్లఫ్ మాస్టర్ ఒరిజినల్ కార్తీ నటించిన ఖాకీ అలాగే పింక్ తమిళ రీమేక్ సినిమాలను డైరెక్ట్ చేసాడు వినోద్. తాజాగా వాలిమై సిద్ధం చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. వాలిమై సినిమా తర్వాత కూడా ఇదే కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. స్టార్ ప్రొడ్యూసర్ బోణికపూర్ - అజిత్ కాంబినేషన్ లో వాలిమై తర్వాత మూడో సినిమా రానుందని సమాచారం. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో సినిమా స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసినట్లు టాక్. కేవలం రెండు నెలల్లోనే షూటింగ్ ముగించే విధంగా ప్లాన్ చేసారని.. త్వరలోనే ఈ సినిమా పై క్లారిటీ రానుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.