'వకీల్ సాబ్' సర్ ప్రైజింగ్ బర్త్ డే గిఫ్ట్

Tue Jul 14 2020 19:00:08 GMT+0530 (IST)

'Vakil Saab' Surprising Birthday Gift

2018లో `అజ్ఞాతవాసి` రిలీజైంది. ఆ తర్వాత జనసేన అధినాయకుడి హోదాలో పవన్ రాజకీయాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. అతడు రాజకీయాల్లో ఉన్నా సినిమాల్లో నటించాలన్నది అభిమానుల కోరిక. అయితే తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తానని పవన్ అనడంతో ఫ్యాన్స్ ఎంతో నిరాశకు గురయ్యారు. కానీ పొలిటికల్ గేమ్ అన్నది ఎండ్ లెస్ గేమ్ అని అర్థం చేసుకునేందుకు పవన్ కి ఎంతో సమయం పట్టనే లేదు. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీని నిలబెట్టుకోవాలంటే ముందు తాను ఆర్థికంగా పరిపుష్ఠంగా ఉండాలని అర్థం చేసుకున్నారు. ఆ క్రమంలోనే వరుసగా సినిమాలకు సంతకాలు చేశారు.`వకీల్ సాబ్` చిత్రంతో పవన్ రీఎంట్రీ ఖాయమైంది. ఈ మూవీ మెజారిటీ షూటింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. నిర్మాత దిల్ రాజు అందించిన సహకారంతో పవన్ ఎంతో కమిట్ మెంట్ తో షూటింగులకు ఎటెండయ్యారు. మెజారిటీ షూటింగ్ పూర్తయినా కరోనా మహమ్మారీ వల్ల అనూహ్యంగా పెండింగ్ షూట్ పూర్తి చేయడం కష్టమైంది. ఈపాటికే వకీల్ సాబ్ రిలీజ్ కావాల్సింది. మహమ్మారీ ఊహించని దెబ్బ కొట్టడంతో ఆలస్యమైంది.

దీనివల్ల పవన్ .. దిల్ రాజు కంటే ఫ్యాన్స్ ఎక్కువ నిరాశపడ్డారు. ఇక వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో వెనకబాటుపై పవన్ అభిమానులు గుర్రుమీదున్నారు. ఇన్నాళ్లు ఆలస్యమైనందుకు అయినా కనీసం ఆ మూవీకి సంబంధించిన పోస్టర్లు టీజర్లు అయినా కళ్ల ముందుకు రావాలనేది ఫ్యాన్స్ కోరిక. కానీ అది కూడా సాధ్యం కావడం లేదు. అందుకే పవన్ ఫ్యాన్స్ లో నిరాశను అర్థం చేసుకుని ఎట్టకేలకు పవన్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న టీజర్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. తన ఫ్యాన్స్ కి పవన్ ఇచ్చే కానుక అది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ చిత్రానికి రీమేక్ ఇది. దిల్ రాజు- బోనీకపూర్ నిర్మిస్తున్నారు.