`వకీల్ సాబ్` సౌండ్స్ ఇంటింటా వినపడుతున్నాయ్!

Mon May 03 2021 17:00:02 GMT+0530 (IST)

'Vakeel Saab' sounds are heard in every house!

ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి టాలీవుడ్ లో దర్శకులుగా ఎదగాలని కలలు కనే యువకులెందరో. కానీ ఇక్కడ అందరికీ అవకాశాలుండవు. కొందరికి అవకాశం వచ్చినప్పుడు వెంటనే నిరూపించుకోవాలి. అలా వచ్చిన వాడే వేణు శ్రీరామ్. తెలంగాణలోని జగిత్యాల  అతడి స్వస్థలం.దర్శకుడిగా కెరీర్ కోసం ప్రయత్నించిన వేణు శ్రీరామ్ .. దిల్ రాజు కాంపౌండ్ లో దశాబ్ధం పైగానే పని చేశారు. ఓ మై ఫ్రెండ్ - ఎంసీఏ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో ఎంసీఎ సక్సెసైనా కానీ అతడికి మరో అవకాశం రావడానికి చాలా సమయమే పట్టింది. ఇటీవలే వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. పవన్ అంత పెద్ద స్టార్ తో అవకాశం దక్కినందుకు తన సంతోషం మాటల్లో వర్ణించలేనిది.

అయితే ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కానీ కొనసాగుతున్న క్రైసిస్ వల్ల ఓటీటీలో కేవలం 21 రోజుల్లోనే రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయితే ఇలా అవ్వడం బాధించిందా? అంటూ వేణు శ్రీరామ్ ని ప్రశ్నిస్తే.. జగిత్యాలలో ఇంటింటా వకీల్ సాబ్ విజయవంతంగా ఆడుతోందని..  తన తల్లి ఊరిలో వెళ్తుంటే అన్ని ఇళ్ల నుంచి కూడా వకీల్ సాబ్ సౌండ్స్ వినిపించేవని చెప్పారని అన్నారు. థియేటర్లకు వెళ్లలేని వారి ఇంటికే వకీల్ సాబ్ వెళ్లినందుకు తాను సంతోషంగా ఉన్నానని అన్నారు.