`వకీల్ సాబ్` డేట్ ఇదే.. రిలీజ్ ఆ ఓటీటీలోనే..!

Mon Mar 01 2021 11:00:02 GMT+0530 (IST)

Vakeel Saab Ott Rights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ కి అధికారిక రీమేక్ ఇది. ఆదిత్య శ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు- బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ తో పాటు డిజిటల్ శాటిలైట్ రిలీజ్ పైనా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ లో ఈ మూవీపై భారీ అంచనాలేర్పడ్డాయి.`వకీల్ సాబ్` ని థియేటర్లలో వీక్షించాలన్న ఆసక్తి ఇప్పటికే ప్రేక్షకాభిమానుల్లో ఉంది. ఈ చిత్రం 9 ఏప్రిల్ 2021 న థియేటర్లలో విడుదలవుతోంది. అలాగే ఓటీటీతో పాటు శాటిలైట్  రిలీజ్ పైనా క్లారిటీ వచ్చింది. ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ హక్కులను దక్కించుకోగా.. జీసినిమాస్ శాటిలైట్ రైట్స్ ని దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన 50రోజుల తర్వాత అంటే.. మే చివరి వారంలో ఈ వేదికలపై అందుబాటులోకి రానుంది.

తాజా సమాచారం మేరకు మే 29న అమెజాన్ ప్రైమ్ వీడియోలో వకీల్ సాబ్ స్ట్రీమింగ్ అవుతుందని తెలిసింది. ఈ సినిమా డిజిటిల్ రైట్స్ దాదాపు 15 కోట్లకి డీల్ జరిగినట్లుగా సమాచారం. సినిమా రిలీజైన 50 రోజులకు అమెజాన్ ప్రైమ్ లో అప్ లోడ్ కానుంది. ఫ్యాన్స్ కోసమే 50 రోజులు వరుకు వేచి చూసి రిలీజ్ చేస్తున్నామని అమెజాన్ ప్రతినిధులు వెల్లడించారు.