వరుసగా 'ఓకే' చెప్తున్నాడు కాని కెమెరా ముందుకు రాడేం?

Tue Sep 29 2020 12:30:39 GMT+0530 (IST)

Vakeel Saab Movie Updates

పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎప్పుడు లేనన్ని సినిమాలకు ఈమద్య కాలంలో ఓకే చెప్పాడు. ఇప్పటికే పింక్ రీమేక్ 'వకీల్ సాబ్' ను చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా హరీష్ శంకర్ తో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈమూడు సినిమాలు మాత్రమే కాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి బ్యానర్ లో ఒక సినిమాను చేసేందుకు కూడా పవన్ 'ఓకే' చెప్పాడు. మరో వైపు బాబీ మరియు డాలీలు కూడా ఆయన డేట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. వారికి కూడా ఓకే అని చెప్పాడు. ఇప్పటికే ఇంత మందికి ఓకే చెప్పిన పవన్ తాజాగా తన భక్తుడు అయిన బండ్ల గణేష్ కు ఓకే చెప్పాడు.నిర్మాతగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని గత కొన్నాళ్లుగా నిర్మాణంకు దూరంగా ఉంటున్న బండ్ల గణేష్ ను ఆదుకునేందుకు పవన్ ఓకే చెప్పాడు. ఆ విషయాన్ని బండ్ల నిన్ననే ప్రకటించాడు. ఇన్ని సినిమాలను కూడా పవన్ వచ్చే ఎన్నికల ముందు అంటే 2021 మరియు 22 ల్లోనే పూర్తి చేయాలని అనుకుంటున్నాడట. ఇన్ని సినిమాలకు కమిట్ అయిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ను పూర్తి చేసేందుకు ముందుకు రావడం లేదు. ఆయన షూటింగ్ లో పాల్గొంటే డిసెంబర్ వరకు వకీల్ సాబ్ ను పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.

ఇటీవలే వకీల్ సాబ్ షూటింగ్ ను పునః ప్రారంభించిన యూనిట్ సభ్యులు ఆయన లేకుండానే కానిచ్చేస్తున్నారు. ఆయన కాంబో లేని సీన్స్ అన్నింటిని పూర్తి చేసి ఆయన కోసం వెయిట్ చేయబోఉన్నారట. ఇప్పటి వరకు వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ లో పవన్ ఎప్పటి నుండి పాల్గొనే విషయంపై యూనిట్ సభ్యులకు కూడా క్లారిటీ లేదట. పవన్ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు వకీల్ సాబ్ ను పూర్తి చేసేందుకు దర్శకుడు రెడీ గా ఉన్నాడు. కేవలం పవన్ 20 నుండి 25 రోజుల డేట్లు ఇస్తే సినిమా పూర్తి అవుతుందని అంటున్నారు. ఇన్ని సినిమాలకు ఓకే చెబుతున్న పవన్ ఒక దాని తర్వాత ఒకటి పూర్తి చేసుకుంటే బాగుంటుంది కదా. మళ్లీ ఎన్నికల సమయంలో సినిమాలను వదిలేయాల్సి వస్తుందని అభిమానులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.