Begin typing your search above and press return to search.

క్రైసిస్ లో ఎక్కువగా నష్టపోయిన స్టార్ హీరో...?

By:  Tupaki Desk   |   6 July 2020 3:01 AM GMT
క్రైసిస్ లో ఎక్కువగా నష్టపోయిన స్టార్ హీరో...?
X
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో నటించినా నటించకపోయినా ఏమాత్రం చరిష్మా తగ్గని నటుడు పవన్ కళ్యాణ్. పవన్ సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఫ్లాప్ టాక్ వచ్చినా కలెక్షన్స్ లో కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. పవన్ తొలి రోజు రికార్డులు అందుకోవడం ఇతర హీరోలకు అంత సులభం కాదంటే అతిశయోక్తి కాదు. కెరీర్లో ఇప్పటి వరకు 25 చిత్రాల్లో నటించిన పవన్ కళ్యాణ్ పూర్తి జీవితం ప్రజాసేవకే అంటూ రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. 'జనసేన' పార్టీ స్థాపించి 2019 ఎలక్షన్స్ లో క్రియాశీలకంగా వ్యవహరించే ప్రయత్నం చేసారు. కానీ ఏపీ ప్రజలు జనసేనని తిరస్కరించారు. దీంతో జనసేన అధినేత పార్టీ కార్యకలాపాల కోసం ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో కెరీర్ లో ఎప్పుడూ లేనంత స్పీడ్ గా వరుస సినిమాలను ఓకే చేస్తూ అభిమానులని ఉక్కిరిబిక్కరి చేశాడు.

ముందుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' పట్టాలెక్కించాడు. 'పింక్' రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాని దిల్ రాజు మరియు బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే క్రిష్ దర్శకత్వం లో ఓ మూవీ కమిట్ అయ్యాడు పవన్. ఈ సినిమాని ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మించనున్నారు. కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా రెండు సినిమాల షూటింగ్స్ పారలెల్ గా జరిగేలా చూసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండు సినిమాలు త్వరగా కంప్లీట్ చేసి తన కెరీర్లో 28వ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వం లో చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ వారు ప్రొడ్యూస్ చేయబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇంత ప్లానింగ్ తో వెళ్తున్న పవన్ కళ్యాణ్ కి కరోనా మహమ్మారి బ్రేక్స్ వేసింది. వీలైనంత త్వరగా సినిమాలు చేయాలని కంకణం కట్టుకున్న పవర్ స్టార్ కి అనుకోని ఆటంకాలు కలిగించింది.

అంతే కాకుండా ఒక్కో సినిమా కి సుమారు 40 కోట్లకు పైనే పవన్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపించింది. ఈ క్రమంలో ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న 'వకీల్ సాబ్' ని సమ్మర్ రిలీజ్ కి రెడీ చేసి ఈ ఏడాది ఎండింగ్ కి క్రిష్ సినిమా పూర్తి చేస్తే ఆర్థికంగా పీకే కి చాలా వరకు మేలు జరిగుండేది. అయితే కరోనా వచ్చి దెబ్బేసింది. ఇప్పటికే నాలుగు నెలలు కాలం వేస్ట్ గా పోయింది. దీనికి తోడు పరిస్థితులు చక్కబడి షూటింగ్ చేయాలంటే సెప్టెంబర్ వరకు టైం పట్టేలా ఉంది. అంటే మరో మూడు నెలల కాలం వృధా గా పోయినట్లే. ఇక 'వకీల్ సాబ్' సినిమా ని అన్నీ కుదిరితే సంక్రాంతి బరిలో నిలపనున్నారు. క్రిష్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కి రావొచ్చు. దీంతో హరీష్ శంకర్ సినిమా మరి కొన్నాళ్లు ముందుకు జరగనుంది. మొత్తం మీద ఈ క్రైసిస్ వల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్లాన్స్ అన్నీ తారుమారు అవడమే కాకుండా ఆర్థికం గా చాలా ఎఫెక్ట్ పడింది. దీనిని బట్టి చూసుకుంటే క్రైసిస్ వలన ఎక్కువగా నస్టపోయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.