Begin typing your search above and press return to search.

వైష్ణవ్‌ 2 'కొండపొలం' కాదట.. మరేంటో తెలుసా?

By:  Tupaki Desk   |   1 March 2021 3:30 AM GMT
వైష్ణవ్‌ 2 కొండపొలం కాదట.. మరేంటో తెలుసా?
X
ఉప్పెన సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా ను క్రిష్‌ దర్శకత్వంలో చేసిన విషయం తెల్సిందే. కొండ పొలం అనే నవల ఆధారంగా కేవలం రెండున్నర నుండి మూడు నెలల గ్యాప్‌ లోనే దర్శకుడు క్రిష్‌ సినిమాను పూర్తి చేశాడు. వైష్ణవ్‌ తేజ్ మరియు రకుల్‌ ప్రీత్‌ సింగ్ లు నటించిన ఈ సినిమా కు కొండ పొలం అనే టైటిల్ నే పరిశీలిస్తున్నట్లుగా మొన్నటి వరకు వరకు వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కు కొండ పొలం అని కాకుండా 'జంగిల్‌ బుక్‌' టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. మీడియా సర్కిల్స్‌ లో కూడా జంగిల్‌ బుక్‌ టైటిల్‌ తెగ ప్రచారం జరుగుతోంది.

వైష్ణవ్‌ తేజ్ తో షూటింగ్‌ పూర్తి చేసి ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ సినిమా షూటింగ్‌ లో ఉన్న క్రిష్‌ టైటిల్‌ విషయమై త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. పవన్‌ తో ప్రస్తుతం చేస్తున్న సినిమా షెడ్యూల్‌ పూర్తి అయిన వెంటనే వైష్ణవ్‌ తేజ్‌ సినిమా ప్రమోషన్‌ తో క్రిష్‌ బిజీ అయ్యే అవకాశం ఉంది. టైటిల్ విషయాన్ని కూడా అప్పుడే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. జంగిల్ బుక్‌ టైటిల్‌ కేవలం పుకారు మాత్రమే అయ్యి ఉంటుందని కూడా కొందరు భావిస్తున్నారు. క్రిష్‌ ఖచ్చితంగా వైవిధ్యభరితంగా ఉండేలా టైటిల్‌ ను ఖరారు చేస్తాడనే నమ్మకంను వారు వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి వైష్ణవ్‌ తేజ్‌ రెండవ సినిమా టైటిల్ విషయమై సస్పెన్స్‌ కు కాస్త తెర పడ్డట్లుగా అనిపించినా కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది. ఉప్పెన సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో మెగా అభిమానులు ప్రేక్షకులు ఈ సినిమా పై నమ్మకం పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయాలని క్రిష్‌ భావిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ విషయమై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.