వైష్ణవ్ 4 ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Tue May 04 2021 10:09:06 GMT+0530 (IST)

Vaishnav Tej Upcoming Movie Updates

మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. మొదటి సినిమా ఉప్పెన సూపర్ హిట్ అయ్యి వంద కోట్లకు పైగా వసూళ్లు అది కూడా కరోనా సమయంలో దక్కించుకోవడంతో వైష్ణవ్ తేజ్ క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. విడుదల అయ్యింది ఒక్క సినిమానే అయినా కూడా ఆయన ఖాతాలో ప్రస్తుతం అయిదు ఆరు సినిమాలు ఉన్నాయంటే ఇప్పుడు అతడి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వైష్ణవ్ తేజ్ తో క్రేజీ డైరెక్టర్స్ సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. యంగ్ హీరోలు ఎంతో ఇష్టపడే క్రిష్ ఇప్పటికే వైష్ణవ్ తో ఒక సినిమాను చేశాడు. ఇక అర్జున్ రెడ్డి తమిళ వర్షన్ కు దర్శకత్వం వహించి సక్సెస్ ను దక్కించుకున్న గిరీషయ్యతో  వైష్ణవ్ తేజ్ మూడవ సినిమా తెరకెక్కతుంది.గిరీషయ్య దర్శకత్వంలో సినిమా ఇప్పటికే పట్టాలెక్కింది. మరో వైపు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మళ్లీ రెండు సినిమాలను చేసేందుకు వైష్ణవ్ అగ్రిమెంట్ చేసుకున్నాడు అంటూ సమాచారం అందుతోంది. ఉప్పెన వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన మైత్రి మూవీస్ వారితో మళ్లీ మళ్లీ సినిమా లు చేయాలని వైష్ణవ్ తేజ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి తోడు వైష్ణవ్ తేజ్ కు భారీ పారితోషికంను కూడా మైత్రి వారు ఆఫర్ చేశారు. వైష్ణవ్ 4 సినిమా ను మైత్రి మూవీస్ వారు నిర్మించబోతున్నట్లుగా దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వెంకీ కుడుముల ఒక సినిమాను చేయాల్సి ఉంది. ఆ సినిమా లో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఛలో మరియు భీష్మ వంటి కమర్షియల్ సక్సెస్ లను తెరకెక్కించిన వెంకీ కుడుముల మహేష్ బాబుతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. కాని కొన్ని కారణాల వల్ల మహేష్ బాబుతో సినిమా సాధ్యం కాలేదు. దాంతో వైష్ణవ్ తేజ్ తో సినిమాను చేసేందుకు వెంకీ సిద్దం అవుతున్నాడనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు కూడా సుకుమార్ సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు.