వడా పావ్ లుక్ అంటూ బన్నీ పై ట్రోలింగ్.. ధీటుగా బదులిస్తున్న ఫ్యాన్స్..!

Mon Jun 27 2022 15:00:01 GMT+0530 (IST)

Vada Pav Look Trolling On Bunny .. Fans Responding

ప్రస్తుతం బాలీవుడ్ పై సౌత్ సినిమా డామినేషన్ కొనసాగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీన్ని జీర్ణించుకోలేని కొందరు నార్త్ ఆడియన్స్ మరియు అక్కడి స్టార్స్ దక్షిణాదిపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. మన హీరోలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.ఆ మధ్య యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ మరియు స్టైలింగ్ గురించి ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లేటెస్టుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను లక్ష్యంగా చేసుకొని నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు.

ఇటీవల బన్నీ ముంబైకి వెళ్లిన సందర్భంలోని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అతను బ్లాక్ ప్యాంటుతో ప్రింటెడ్ టీ-షర్ట్ లో పుష్పరాజ్ అవతార్ లో కనిపించాడు. కాకపోతే వీటిల్లో నార్మల్ గా కంటే కొంచెం భారీగా కనిపిస్తున్నాడు.

దీంతో అల్లు అర్జున్ లుక్ పై బాలీవుడ్ జనాలు నెగిటివ్ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. కొందరు మోటా భాయ్ అని ట్రోల్ చేస్తుంటే.. మరికొందరు వడా పావ్ లుక్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వీరికి టాలీవుడ్ సినీ అభిమానులు మరియు బన్నీ ఫ్యాన్స్ స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తున్నారు.

వడా పావ్ తింటూ బాలీవుడ్ స్టార్స్ టాలీవుడ్ లో ప్రమోషన్స్ చేసుకుంటున్నారని.. అదే సమయంలో అల్లు అర్జున్ ఎలాంటి పబ్లిసిటీ చేయకుండానే 'పుష్ప' సినిమాతో నార్త్ సర్కూట్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడని బదులిస్తున్నారు.

బన్నీ స్టైలింగ్ కు బాలీవుడ్ దాసోహం అన్న విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. అతని సినిమాలను హిందీలోకి డబ్ చేసి వదిలితే.. ఉత్తరాది ఆడియన్స్ మిలియన్ల వ్యూస్ ను కట్టబెట్టడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

అల్లు అర్జున్ మాస్.. ఊర మాస్.. ఎలా ఉన్నా స్టైలిష్ గా ఉంటాడు అంటూ బాలీవుడ్ ట్రోలర్స్ కు దీటుగా సమాధానం చెబుతున్నారు. నిజానికి అల్లు అర్జున్ ఒక అద్భుతమైన పెర్ఫార్మర్ మాత్రమే కాదు.. స్టైల్ ఐకాన్ కూడా. అందుకే అతను స్టైలిష్ స్టార్ అయ్యాడు.

బన్నీ ఆన్ స్క్రీన్ మరియు ఆఫ్ స్క్రీన్ లుక్స్ కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సినిమా సినిమాకి అల్లు అర్జున్ లుక్ మరియు స్టైలింగ్ లో చూపించే వెరీయేష్ ను అందరూ ఇష్టపడుతుంటారు.. ఫాలో అవుతుంటారు.

తన చివరి చిత్రం 'పుష్ప' లో బన్నీ లుక్ నార్త్ జనాలను విపరీతంగా ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే. బన్నీని అతని నటనకు పలువురు బీటౌన్ సినీ ప్రముఖులు ఫిదా అయ్యారు. 'పుష్ప 2' సినిమాతో మరోసారి నార్త్ మార్కెట్ లో తన సత్తా ఏంటో చూపించడానికి రెడీ అవుతున్నారు.

అల్లు అర్జున్ సి సినిమాల్లోనే కాదు.. బయట కూడా అలాంటి లైఫ్ స్టైల్ ను కొనసాగిస్తుంటారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేటెస్టుగా ట్రోలింగ్ కి గురవుతున్న లుక్ కూడా కేవలం వదులుగా ఉన్న టీ-షర్టు వేసుకోవడం వల్ల.. కెమెరా యాంగిల్ కారణంగానే అలా కనిపిస్తుందని చెప్పాలి.

అయితే బన్నీ ని ట్రోల్ చేయడానికి వారికి ఏమీ దొరకదు కాబట్టి.. ఈ విధంగా అతనిని అవమానించడం ప్రారంభించారని అర్థం అవుతోంది. 'పుష్ప: ది రూల్' సినిమాతో నార్త్ లో అన్ని రికార్డులను బద్దలు కొట్టి.. అల్లు అర్జున్ అంటే.. అతని స్టైలింగ్ అంటే ఏంటో చూపిస్తాడని అభిమానులు ధీమాగా ఉన్నారు.