స్వగ్రామంలో వాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్.. మహేష్ పై ప్రశంసల జల్లు!

Wed Jun 09 2021 22:00:01 GMT+0530 (IST)

Vaccination drive success in his hometown Praise showers on Mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు వారి స్వగ్రామం అయినటువంటి బుర్రిపాలెంలో ఎన్నో సామాజిక సేవాకార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణగారి పేరు మీదగా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఊరికి కావాల్సిన అన్ని సదుపాయాలు అవసరాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని మరీ మహేష్ సాయం అందిస్తున్నాడు. శ్రీమంతుడు సినిమాలో చెప్పినట్లుగా "ఊరు మనకు చాలా ఇచ్చింది తిరిగి ఊరికి మనం చాలా చేయాలి" అంటూనే మహేష్ సేవలు కంటిన్యూ చేస్తున్నాడు. కరోనా కష్టకాలంలో తన ఊరుకు ఊరి జనాలకు కావాల్సిన అత్యవసరాలు ఏర్పాటు చేస్తున్నాడు.అయితే గతనెలలో అంటే.. మే 31న మహేష్ బాబు తండ్రి సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా వారి బుర్రిపాలెంలో ఉచిత వాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మహేష్. కరోనా వ్యాధి సోకకుండా గ్రామ ప్రజలందరికి వ్యాక్సిన్ వారం పాటు వ్యాక్సిన్ పంపిణీ చేసాడు. అలాగే గ్రామ ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయలను అందిస్తున్నాడు. తాజాగా బుర్రిపాలెం గ్రామంలో కరోనా వాక్సిన్ పంపిణీ విజయవంతంగా పూర్తి అయినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. మొత్తం 12 వార్డులు ఉన్న ఆ ఊరిలో రోజుకి రెండు వార్డుల చొప్పున మొత్తం వారం రోజుల్లో 12 వార్డుల ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆ గ్రామస్థులు వీడియోలో తెలిపారు.

ఈ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమానికి వాలంటీర్స్‌గా 'టీం మహేష్ బాబు' సభ్యులకు అలాగే 'ఆంధ్రా హాస్పటల్' వైద్యులకు ధన్యవాదాలు ఆ గ్రామస్తులు ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఇప్పటివరకు ఎంతోమందికి వైద్యసహాయం అందించిన మహేష్ తమ గ్రామంలో వాక్సిన్ డ్రైవ్ నిర్వహించడం పై సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు చెప్పారు గ్రామస్తులు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వైద్యబృందానికి - వాలంటీర్లకు స్పెషల్ థాంక్స్ అంటూ ట్వీట్ చేశారు మహేష్ సతీమణి నమ్రత. ఈ సందర్బంగా సూపర్ స్టార్ ను సోషల్ మీడియా వేదికగా నేటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట - త్రివిక్రమ్ సినిమాలు చేస్తున్నాడు.

https://twitter.com/MBofficialTeam/status/1402571759857983495?s=19