Begin typing your search above and press return to search.

వీడియోః VD11 టైమ్‌ తో సహా ముహూర్తం ఫిక్స్‌.. బాబోయ్ అలా పేల్చారేంటి?

By:  Tupaki Desk   |   15 May 2022 9:53 AM GMT
వీడియోః VD11 టైమ్‌ తో సహా ముహూర్తం ఫిక్స్‌.. బాబోయ్ అలా పేల్చారేంటి?
X
విజయ్ దేవరకొండ లైగర్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఆగస్టు లో సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. లైగర్ విడుదల అయిన వెంటనే మజిలీ చిత్ర దర్శకుడు శివ నిర్వాన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. షూటింగ్ చకచక జరుగుతున్న నేపథ్యంలో ఇదే ఏడాదిలో సినిమా వస్తుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.

సినిమా షూటింగ్‌ కశ్మీర్‌ లో మొదటి షెడ్యూల్‌ ను దాదాపుగా ముగించుకుంది. ఇప్పుడు సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ ను రివీల్‌ చేసేందుకు ఏర్పాటు చేశారు. మొన్న విజయ్ దేవరకొండ బర్త్‌ డే సందర్బంగా ఫస్ట్‌ లుక్‌ ను ఇవ్వాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల సినిమా నుండి ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయలేక పోయారు. ఇప్పుడు సినిమా ఫస్ట్‌ లుక్‌ ను రివీల్‌ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఈనెల 16వ తారీకున విజయ్ దేవరకొండ 11వ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్ మరియు టైటిల్‌ ను రివీల్‌ చేయబోతున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా కు సంబంధించిన టైటిల్‌ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్‌ కాని.. లీక్ కాని లేదు. అసలు రేపు సినిమా యొక్క టైటిల్ ను రివీల్ చేస్తున్నారా లేదా కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే ఇస్తున్నారా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

ఈనెల 16వ తారీకు ఉదయం 9.30 కి విజయ్‌ దేవరకొండ 11వ సినిమా అఫిషియల్‌ అప్‌డేట్‌ ఇవ్వబోతున్నారు. షూటింగ్‌ చకచక చేసి ఇదే ఏడాదిలో సినిమా ఇవ్వాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అభిమానులతో పాటు సినీ ప్రేమికులు అంతా కూడా ఆసక్తిగా ఉన్నారు. విజయ్‌ దేవరకొండ కు కెరీర్‌ లో ఇది 11వ సినిమా అవ్వడంతో ఎప్పటికి ఈ సినిమా మంచి ఫలితం సాధించి నిలిచి పోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

గతంలో మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ మరియు సమంత కలిసి నటించిన విషయం తెల్సిందే. మళ్లీ ఈ సినిమా లో శివ నిర్వాన దర్శకత్వంలో కలిసి నటించారు. వీరిద్దరి ప్రేమ కథ చాలా బాగుంటుందని తెలుస్తోంది. ఇటీవలే విజయ్ దేవరకొండ స్పందిస్తూ లైగర్ సినిమా తన కెరీర్‌ లోనే అతి పెద్ద సినిమా అన్నాడు. అదే సమయంలో శివ నిర్వాన దర్శకత్వంలో చేస్తున్న సినిమా తన కెరీర్‌ లోనే ఒక విభిన్నమైన ప్రేమ కథ సినిమా అన్నాడు. కనుక అంచనాలు భారీగా పెరిగాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి.

ఇక ఫస్ట్‌ లుక్ విడుదలకు సంబంధించి ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు శివ నిర్వాన స్టంట్స్ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్ కు సన్నివేశం వివరిస్తూ ఉంటాడు. హీరో చాలా కూల్‌ గా ఉంటాడు.. చాలా పద్దతిగా ఉంటాడు. ఇద్దరి మద్య ప్రేమ కథ అంటూ చాలా సాఫ్ట్‌గ ఆ డీల్‌ చేయమంటాడు. అప్పుడు పీటర్‌ హెయిన్స్‌ కెమెరా యాక్షన్‌ అనగానే బాంబు పేల్చాడు. బాబోయ్‌ లవ్‌ స్టోరీ లో ఈ బాంబు ఏంట్రా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.