Begin typing your search above and press return to search.

బుల్లితెరపై నిరాశపరిచిన ఉస్తాద్ హీరో!

By:  Tupaki Desk   |   22 April 2021 11:30 AM GMT
బుల్లితెరపై నిరాశపరిచిన ఉస్తాద్ హీరో!
X
ఈ ఏడాది విడుదలైన టాలీవుడ్ మూవీస్ ఒక్కొక్కటిగా బుల్లితెర పై, డిజిటల్ స్క్రీన్ పై ప్రసారం అవుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఫస్ట్ బ్లాక్ బస్టర్ నమోదు చేసిన క్రాక్ మూవీ భారీ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఫస్ట్ టైం టీవీలో ప్రసారమైన క్రాక్ మూవీ.. అదిరిపోయే రేంజిలో 11.7 టిఆర్పీ రేటింగ్ నమోదు చేసింది. రెండోసారి ప్రసారం అయినప్పుడు కూడా 7.52 రేటింగ్ దక్కించుకుంది. అంతేగాక రవితేజ కెరీర్లోనే బెస్ట్ టిఆర్పీ రేటింగ్ తెచ్చిన సినిమాగా క్రాక్ నిలిచింది. అయితే క్రాక్ తో పాటుగా చాలా సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయ్యాయి. వాటిలో అల్లరి నరేష్ నటించిన బంగారుబుల్లోడు సినిమా కూడా ఉంది.

ఈ సినిమా టీవీలో ప్రసారమై 2.42 టిఆర్పీ రేటింగ్ వద్ద నిలిచిపోయింది. అలాగే తేజ సజ్జా డెబ్యూ మూవీ జాంబిరెడ్డి మూవీ మొదటిసారి 9.7 టిఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ ఏడాది విడుదలై టీవీలో ప్రసారమైన మూవీస్ లిస్టులో హీరో రామ్ నటించిన రెడ్ మూవీ కుడా చేరింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మోస్తరు విజయాన్ని అందుకుంది. మరి ఫస్ట్ టైమ్ టీవీలో ప్రసారమైన ఈ సినిమా 5.02 టిఆర్పి రేటింగ్ నెలకొల్పింది. అంటే రామ్ క్రేజ్ బట్టి చూస్తే 5.02 అనేది తక్కువే అని చెప్పాలి. మరి ఇదివరకు రిలీజైన సినిమాలే ఇప్పటికి ముందువరుసలో ఉన్నాయి.

వాటిలో సరిలేరు నీకెవ్వరూ ఫస్ట్ టైం 23.4 రేటింగ్ సెట్ చేసింది. కానీ ఐదోసారి కూడా 6.41 సెట్ దక్కించుకోవడం విశేషం. అలాగే అలవైకుంఠపురంలో 29.4, ప్రతిరోజూ పండగే 15.3, సైరా నరసింహరెడ్డి 11.8, డబ్బింగ్ మూవీ కేజీఎఫ్ 11.9 ఇలా అన్ని ఫస్ట్ టైం రికార్డు బ్రేకింగ్ రేటింగ్స్ సొంతం చేసుకున్నాయి. మరి రామ్ రెడ్ మూవీ ఫస్ట్ టైమే 5.02 రేటింగ్ అంటే అర్ధం చేసుకోవచ్చు. మహేష్ సరిలేరు మూవీ ఐదోసారి కూడా 6.41 రేటింగ్ అందుకుంది అంటే రెడ్ మూవీ ఫస్ట్ టైం కూడా అంతలా రాబట్టలేకపోయింది. మొత్తానికి సినిమా అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో భారీ కమర్షియల్ మూవీ చేస్తున్నాడు.