Begin typing your search above and press return to search.

టీజ‌ర్ టాక్ : ఇంట్లో బుద్ధిమాన్ ..వీధిలో శ‌క్తిమాన్‌!

By:  Tupaki Desk   |   29 Sep 2022 11:44 AM GMT
టీజ‌ర్ టాక్ : ఇంట్లో బుద్ధిమాన్ ..వీధిలో శ‌క్తిమాన్‌!
X
అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంట‌గా న‌టిస్తున్న రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ `ఊర్వ‌శివో రాక్ష‌సివో`. జీఏ 2 పిక్చ‌ర్స్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ధీర‌జ్ మొగిలినేని ఈ మూవీని నిర్మిస్తున్నారు. క‌ల్యాణ్ దేవ్ తో `విజేత‌` మూవీని రూపొందించిన రాకేష్ శ‌శి ఈ మూవీకి ద‌ర్శ‌కుడు. ABCD మూవీ త‌రువాత శిరీష్ నుంచి మ‌రో సినిమా రాలేదు. త‌న నుంచి సినిమా వ‌చ్చి దాదాపు రెండేళ్ల‌కు పైనే అవుతోంది. ఈ నేప‌థ్యంలో కొత్త సినిమా `ఊర్వ‌శివో రాక్ష‌సివో`తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

అల్లు శిరీష్‌కు, శైల‌జా రెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్‌, మ‌హా స‌ముద్రం వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల‌తో కెరీర్ లో డేంజ‌ర్ స్టేజ్ లో వున్న అను ఇమ్మాన్యుయేల్ కు ఈ మూవీ చాలా కీల‌కంగా మారింది. ముందు `ప్రేమ కాదంట‌` అంటూ హ‌డావిడి చేసిన చిత్ర బృందం ఫైన‌ల్ గా ఈ మూవీ టైటిల్ ని `ఊర్వ‌శివొ రాక్ష‌సివో`గా మార్చేసి రీసెంట్ గా ఫ‌స్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీని న‌వంబ‌ర్ 4న రిలీజ్ చేయ‌బోతున్నారు.

తాజాగా సినిమా టైటిల్ తో పాటు మేక‌ర్స్ రిలీజ్ డేట్ ని కూడా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీతో మ‌ళ్లీ ట్రాక్ లోకి రావాల‌ని అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్ గ‌ట్టి న‌మ్మ‌కంతో వున్నారు. ఈ సంద‌ర్భంగా గుర‌వారం ఈ మూవీ టీజ‌ర్ ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. `కొన్ని విష‌యాలు మ‌నం ఎంత ట్రై చేసినా జ‌ర‌గ‌వు.. ఒకోసారి అనుకోకుండానే జ‌రిగిపోతాయి. అలాంట‌ప్పుడే అది మ‌ళ్లీ మ‌ళ్లీ జ‌రిగితే బాగుండు అనిపిస్తుంది` అంటూ అల్లు శిరీష్ వాయిస్ తో టీజ‌ర్ మొద‌లైంది.

డైలాగ్ క‌ట్ కాగానే అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్ అనుకోకుండా ద‌గ్గ‌ర‌కావ‌డం.. లిప్ లాకుల్లో మునిగిపోవ‌డం.. ఆ త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డ‌టం.. నువ్వు మామూలోడికి కాదు రాజా ఇంట్లో బుద్దిమాన్ ..వీధిలో శ‌క్తిమాన్‌.. అంటూ పోసాని అంటున్న తీరు.. శిరీష్ ల‌స్ట్ స్టోరీ గురించి తెలుసుకున్న వెన్నెల కిషోర్ `అమ్మ‌నా ఆల్ట్ బాలాజీ నువ్వేంట్రా మ‌నీ హైస్ట్ లో ప్రొఫెస‌ర్ లా ఇంత ప్లానింగ్ తో వున్నావు` అంటూ అదిరిపోయే పంచ్ వేయ‌డం..

ఆ త‌రువాత అల్లు శిరీష్‌, అను శారీర‌కంగా క‌లిసి పోవ‌డం.. ఆ త‌రువాత నేను ల‌వ్ చేస్తున్నాన‌ని శిరీష్ అంటే .. నేను జ‌స్ట్ ఫ్రెండ్షిప్ మాత్ర‌మే చేశాన‌ని అను అన‌డం.. ఎండింగ్ లో సునీల్ .. అల్లుడూ ఇది కొంచెం ట‌ఫ్ మ్యాచ్ రా.. కేర్ ఫుల్ గా ఆడు` అంటూ చివ‌రి పంచ్ వేయ‌డం న‌వ్వులు పూయిస్తోంది. ఓవ‌రాల్ గా శిరీష్ ఈ సారి హాట్ టాపిక్ కావాల‌నే కాస్త ఘాటు కంటెంట్ తో యూత్ ని మెల్ట్ చేసే సీన్ ల‌తో వ‌స్తున్న‌ట్టుగా తెలుస్తోంది. టీజ‌ర్ చూసిన వాళ్లంతా హిట్ కోసం ఈ సారి అల్లు శిరీష్‌..అను ర‌చ్చ లేప‌బోతున్న‌ట్టుగా వున్నారుగా అని కామెంట్ లు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.