ఊర్వశి వీడియో 500 మిలియన్లు క్రాస్ చేస్తుందట

Mon May 03 2021 16:00:01 GMT+0530 (IST)

Urvashi video crosses 500 million

హేట్ స్టోరి 4 .. గ్రేట్ గ్రాండ్ మస్తీ లాంటి చిత్రాలతో ఊర్వశి రౌతేలా యువతరం హాట్ ఫేవరెట్ గా మారింది. బాలీవుడ్ లో హాటెస్ట్ హీరోయిన్ గా హవా సాగిస్తోంది. ప్రస్తుతం హిందీ చిత్రసీమతో పాటు తెలుగు సినీపరిశ్రమపైనా దృష్టి సారించిన ఈ బ్యూటీ తదుపరి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్పలో ఐటెమ్ నంబర్ లో కనిపించనుంది.రింగ రింగ రేంజులో దేవీశ్రీ ట్యూన్ ని రెడీ చేస్తున్నారన్న టాక్ వినిపించింది. ఊర్వశి అందాల ట్రీట్ తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుందనే భావిస్తున్నారు. మరోవైపు గోపిచంద్ చిత్రంలోనూ ఊర్వశి స్పెషల్ నంబర్ తో అలరించనుంది.

తాజాగా టీసీరీస్ భూషణ్ కుమార్ నిర్మించిన `దూబ్ గయే` వీడియో ఆల్బమ్ లో ఊర్వశి నర్తించింది. ఈ వీడియో రిలీజైన కేవలం 24 గంటల్లోనే వరల్డ్ వైడ్ 45 మిలియన్ల వీక్షణల్ని అందుకుంది. ఈ వీడియో 500 మిలియన్లను క్రాస్ చేస్తుంది అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ కి ఊర్వశి కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఆనందాన్ని ట్విట్టర్ వేదికగానూ షేర్ చేసింది.