పొట్టి కారులో పొడుగు భామ పాట్లే పాట్లు!

Sat Jul 31 2021 16:06:28 GMT+0530 (IST)

Urvashi gets out of a Lamborghini car

కార్లంటే ఎవరికి పిచ్చి ఉండదు. అదీ నేటి యువతలో కార్ మోజు అంతా ఇంతా కాదు. అందుకే కార్ల కంపెనీలు అన్ని రకాల సౌకర్యాలతో కొత్త మోడల్స్ ని రంగంలోకి దించేస్తున్నాయి. కానీ వాటిల్లో మనకు ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో చెక్ చేసుకోవాలి. లేదంటే.. ఇదిగో ఇలా ఉంటుంది. కొన్న తర్వాత ఇలా తమని తామే తిట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా అంతే చికాగ్గా ఉంది.ఊర్వశీ లాంబోర్గిణి కార్ నుంచి దిగుతూ ఇదిగో ఇలా నానా అవస్తులు పడుతోంది. దిగేటప్పుడు ఎంతో అసౌకర్యానికి... ఇబ్బందికి గురైంది. కారు హైట్ లేదు. లోపల కూర్చోవడం ఇబ్బందే. కార్ ఆగాక అందులో నుంచి దిగడం చాలా ఇబ్బందిగా మారిందని ఫోటో చూస్తేనే తెలుస్తోంది. ఊర్వశీ కారులో నుంచి దిగే సమయంలో పూర్తిగా వంగి ఉంది. అయితే సకల సౌకర్యాలు గొప్ప ఫీచర్స్ తో ఉండే ఈ ఖరీదైన కార్ లో సీటింగ్ ఒక్కటే ఇబ్బంది కావొచ్చు.

ఇది ఊర్వశి రౌతేలా సొంత కారా? లేక ఆన్ లొకేషన్ ఎవరైనా ప్రెండ్ కారు తెచ్చి ఇలా ఇబ్బంది పడిందా? అన్నది తెలియాల్సి ఉంటుంది. ఊర్వశీ రౌతేలా బాలీవుడ్ లో కొన్ని హిట్ సినిమాలు చేసింది. పలు వెబ్ సిరీస్ లు...పాప్ ఆల్బమ్ ల్లోనూ నటించింది. ఇక తెలుగు- తమిళ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. గోపిచంద్ సీటీమార్ లో ఐటమ్ నంబర్ చేసిందని.. బన్ని పుష్పలోనూ ఐటమ్ నంబర్ చేస్తుందని ఇటీవల ఊర్వశి పేరు ప్రముఖంగా వినిపించింది. లెజెండ్ లాంటి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లో ఊర్వశి స్పెషల్ నంబర్ ఉంటుందని ప్రచారం సాగుతోంది. కానీ అందులో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.