Begin typing your search above and press return to search.

వీడియో: బిగువుల‌తో బ‌రువులెత్త‌క‌లా!

By:  Tupaki Desk   |   18 Feb 2020 7:30 AM GMT
వీడియో: బిగువుల‌తో బ‌రువులెత్త‌క‌లా!
X
బాలీవుడ్ అంద‌గ‌త్తెల వ‌ర్క‌వుట్ వీడియోల‌కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. నేటిత‌రం భామ‌ల నుంచి సీనియ‌ర్ న‌టీమ‌ణుల వ‌ర‌కూ నిరంత‌రం జిమ్ లో క‌స‌ర‌త్తులు చేస్తూ వేడి పెంచే వీడియోల్ని అభిమానుల‌కు నిరంత‌రం షేర్ చేస్తూనే ఉన్నారు. వాటిలో కొన్ని వీడియోలు అంత‌ర్జాలంలో అగ్గి రాజేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. మ‌లైకా- శిల్పా శెట్టి- జాన్వీ- సారా .. ఒక‌రేమిటి నిరంత‌రం జిమ్మాయ‌న‌మః అంటూ సెగ‌లు పుట్టిస్తున్న భామ‌లెంద‌రో. లేటెస్టుగా ఊర్వ‌శి రౌతేలా జిమ్మింగ్ వీడియో ఆ లెవ‌ల్లోనే వైర‌ల్ అయిపోతోంది.

ఎంతో సెన్సిటివ్ గా ఉండే అమ్మాయిలు ఇంత‌గా బ‌రువులు ఎత్తుతారా? అని ఆశ్చ‌ర్య‌ పోయేలా.. హేట్ స్టోరి బ్యూటీ ఊర్వ‌శి రౌతేలా సాహ‌సం షాకిస్తోంది. ఇది న‌డుము భాగం ఉద‌రానికి సంబంధించిన ప్ర‌త్యేక‌మైన ఎక్స‌ర్ సైజ్. అయితే ఆ ఎక్స‌ర్ సైజులు చేస్తున్న‌ప్పుడు బిగి స‌డ‌ల‌ని ఆ అందాల ఎగ‌సెగ‌సిప‌డుతుంటే వీక్ష‌కుల‌కు ఒక‌టే క‌నువిందు. ఆ క‌ష్టం చూస్తే.. న‌డుము చుట్టూ కొవ్వు క‌ర‌గాలంటే ఇంత‌గా శ్ర‌మించాలా? అని ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. సెల‌బ్రిటీలు గ్లామ‌ర్ మెయింటెయిన్ చేయ‌డం కోసం త‌పించే తీరును ఈ వీడియో స్ప‌ష్టంగా అర్థ‌మ‌య్యేలా చెబుతోంది. ఊర్వ‌శి చెమ‌ట‌లు కక్కేస్తున్నా ఎంతో ప‌ట్టుద‌లగా క‌స‌ర‌త్తు చేస్తోంది.

ఇక బాలీవుడ్ హాట్ గాళ్‌ ఊర్వశి రౌతేలాకు ఉన్న ఫాలోయింగ్ ఆసాధార‌ణం. ఇన్ స్టాలో ఈ అమ్మ‌డికి ఇప్ప‌టికే 24 మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఫిట్ బాడీ ని మెయింటెయిన్ చేయ‌డంలో మ‌లైకా- శిల్పా శెట్టి వంటి సీనియ‌ర్ల‌ను మించిపోతోంది. ఊర్వశి రౌతెలా అందానికి టీమిండియా ఆల్ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సైతం గింగిరాలు తిరిగింది. అయితే హార్థిక్ ఇటీవ‌లే న‌టాషాతో ల‌వ్ లో ప‌డ‌డంతో ప్లాన్ బెడిసి కొట్టింది పాపం. ఆ స్ట్రోక్ తో య‌థావిధిగా ఇలా వ‌ర్క‌వుట్ల‌తోనే కాల‌క్షేపం చేయాల్సొచ్చింది పాపం!! ఇటు 30కేజీలు (15+15 కేజీలు) అటు 30 కేజీల బ‌రువులు ఎత్తేస్తోంది చూశారా!!


వీడియో కోసం క్లిక్ చేయండి