ఫోటో స్టొరీ: నిజంగా అప్సరస ఊర్వశే!

Mon May 27 2019 17:09:42 GMT+0530 (IST)

Urvashi Rautela Photo Shoot

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా పేరు తెలుసా?  ఊర్వశి మొదట్లో మోడలింగ్ రంగంలో తన సత్తా చాటింది.  మిస్ దివా-2015 గా ఎంపికయిన ఈ భామ అదే ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో కూడా పాల్గొంది.  ఇక 'సింగ్ సాబ్ ది గ్రేట్' తో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి  'సనమ్ రే'.. 'గ్రేట్ గ్రాండ్ మస్తి'.. 'హేట్ స్టొరీ 4' లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం 'పాగల్ పంటి' అనే సినిమాలో నటిస్తోంది.  మోడలింగ్ రంగం నుంచి వచ్చిన భామ కావడంతో హాట్ ఫోటో షూట్లు చెయ్యడం అనేది అమూల్ వెన్నతో పెట్టిన విద్య.తాజాగా అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ ఒక ఫోటో షూట్ చేసి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు "ఈ అవకాశం ఇచ్చినందుకు ఫెమినా మిస్ ఇండియా వారికి కృతజ్ఞతలు" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మరి ఫెమినా మ్యాగజైన్ కోసమే ఈ ఫోటో షూట్ చేసిందేమో.   మెరుస్తూ ఉన్న డిజైనర్ శాటిన్ టాప్.. అదే రకమైన థై స్లిట్ గౌన్ ధరించి హాటు పోజులిచ్చింది. ఎరుపు రంగు లిప్ స్టిక్.. పక్కకు దువ్విన హెయిర్ స్టైల్ తో ఒక మోడల్ లాగానే ఉంది. పొడవాటి చెవి రింగులు.. చేతికి ఉంగరాలు ధరించింది కానీ మెడలో నెక్లెస్ మాత్రం లేదు.  డీప్ వీ నెక్ ఉండడంతో క్లీవేజ్ షో జరిగిపోయింది.  పాప అసలే పాలరాతి శిల్పంలాగా ఉండడంతో మిలమిలా మెరిసిపోతోంది.

ఒకరు "సెక్సీ బార్బీ డాల్" అన్నారు. మరొకరు.. "పట్టు లాంటి చర్మం" అన్నారు. ఇంకొకరు "వాహ్.. క్యా బాత్ హై" అన్నారు. మరో నెటిజనుడు"సచ్ మే తుమ్ ఊర్వశి హో" అన్నారు.  అర్థం అయిందిగా.. రంభ మేనక అప్సరసల బ్యాచ్ లో మరో సుందరాంగి ఊర్వశితోనే పోల్చాడు. కామెంట్స్ ఇలా ఉంటే.. ఈ ఫోటో పోస్ట్ చేసిన జస్ట్ గంటలోపే రెండున్నర లక్షల లైక్స్ కూడా వచ్చాయి.