Begin typing your search above and press return to search.

వెబ్ సిరీస్ లో ఊర్మిళ దుమారం త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   7 Oct 2022 9:30 AM GMT
వెబ్ సిరీస్ లో ఊర్మిళ దుమారం త‌ప్ప‌దా?
X
బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళ మండోత్క‌ర్ నాలుగేళ్ల‌గా సినిమాల‌కు దూరంగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. అవ‌కాశాలు రాక‌...స‌రైస‌న‌న పాత్ర‌లు దొర‌క‌క గ్యాప్ ఇచ్చిందా? అన్న‌ది క్లారిటీ లేదు గానీ..ఊర్మిళ తెర‌పై ఎప్పుడు క‌నిపించినా ఓ సంచ‌ల‌న‌మే అన్న‌ది వాస్త‌వం. యాభైకి చేరువ‌లోనూ ఊర్మిళ ధ‌గ‌ధ‌గ‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. వెండి తెర‌పై మెరిసిన అమ్మ‌డు బుల్లి తెర‌పైనా త‌న‌దైన మార్క్ వేసింది.

ప‌లు రియాల్టీ షోల‌ను హోస్ట్ చేసి ఐడెంటీ వేసింది. ప్ర‌స్తుతం డిడ్ సూప‌ర్ మామ్స్ సీజ‌న్ -3ర‌ని హోస్ట చేస్తోంది. తాజాగా ఊర్మిళ వెబ్ సిరీస్ ల‌కు సై అనేసింది. 'తివారీ' అనే వెబ్ సిరీస్ కి క‌మిట్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె ద్విపాత్రాభిన‌యం చేస్తుంది. త‌ల్లి -కుమార్తె నేప‌థ్యంలో సాగే స్టోరీ కావ‌డంతో ఆ రెండు పాత్ర‌లు కూడా ఆమె పోషిస్తుందిట‌.

పాత్ర‌ల‌కు సంబంధించి ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ కూడా తీసుకుంటుందిట‌. గ‌త ఆరు నెల‌లుగా అదే ప‌నిలో బిజీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ పాత్ర‌ల గురించి స్పందించింది. ' నాలోని న‌టికి తివారీ స‌వాల్ విసురుతుంది. ఇందులో అనుబంధాలే కాదు.. ఊహించ‌ని మ‌లుపు యాక్ష‌న్ స‌న్నివేశాలు..రొమాంటిక్ సీన్లు ఉంటాయ‌ని' రివీల్ చేసింది.

మొత్తానికి ఊర్మిళ సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ గ‌ట్టిగానే ఊపేట‌ట్లు క‌నిపిస్తుంది. స్టార్ హీరోయిన్ గా కొన‌సాగినంత కాలం బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది. ఆ త‌ర్వాత ఒ్క‌సారిగా చ‌ల్ల‌బ‌డింది. కొంత కాలంగా స‌రైన అవ‌కాశాలు రావ‌డం లేదు. ఈ క్ర‌మంలో కొంత గ్యాప్ వ‌చ్చింది. మ‌ళ్లీ ఇప్పుడు ఓటీటీని షేక్ చేయ‌డానికి రెడీ అవుతోంది.

ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ ల్లోకి స్టార్ హీరోయిన్లు సైతం ఎంట్రీ ఇస్తున్నారు. ఈక్ర‌మంలో అక్క‌డా పోటీ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. ఒక‌రికొక‌రు పోటీ ప‌డుతూ స‌త్తా చాటుతున్నారు. వెండి తెర‌ను మించి ఓటీటీ బోల్డ్ కంటెంట్ లో విచ్చ‌ల‌విడిగా న‌టించ‌డానికి ఎలాంటి అడ్డంకులు పెట్ట‌డం లేదు.

ఛాన్స్ ఇవ్వాలే గానీ.. ద‌ర్శ‌కుడి సృత‌జాన్మ‌త‌క‌ని మించి పెర్పార్మెన్స్ ఇస్తున్నారు. మ‌రి ఆ ర‌కంగా ఊర్మిళ కూడా రేసులో నిలుస్తుందా? అన్న‌ది చూడాలి. ఊర్మిళ తెలుగులోనూ అంతే ఫేమ‌స్. ఆమె 'అంతం'..'గాయం'..'అన‌గ‌న‌గా ఒక రోజు' లాంటి తెలుగు చిత్రాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.