బ్లాక్ మెయిలర్ పై ఉర్ఫీ ఫిర్యాదు.. స్పందించని పోలీసులు?!

Mon Aug 15 2022 09:30:59 GMT+0530 (IST)

Urfi's complaint against black mailer.. Police did not respond?!

ఉర్ఫీ జావేద్ పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ హిందీ కంటెస్టెంట్ గా పాపులారిటీ దక్కించుకున్న ఉర్ఫీ అంతకుమించి ఫోటోషూట్ క్వీన్ గా అందరి మనసుల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాల్లో నిరంతరం వైవిధ్యమైన ఫోటోషూట్లతో  ఉర్పీ తన ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది. తద్వారా సామాజిక మీడియాల్లో ప్రకటనల ఆదాయాన్ని అపారంగా ఆర్జిస్తోంది. టీవీ నటిగా కంటే ఇప్పుడు సోషల్ మీడియాల్లో ఉర్ఫీ ఆదాయం అమాంతం పెరిగింది.అయితే ఉర్ఫీ ఒక శృంగార నాయికను తలపించేలా అర్థ నగ్న ఫోటోషూట్లతో యూత్ ని టీజ్ చేయడంపై తీవ్ర విమర్శలున్నాయి. ఏది ఏమైనా తాను ఎంచుకున్న మార్గంలో ఉర్ఫీ అసాధారణ ఫాలోయింగ్ ని సంపాదిస్తోంది.

సాధారణ వ్యక్తులకు సాధ్యంకాని విచిత్రమైన ఫ్యాషన్ ఎంపికలతో ఉర్ఫీ జావేద్ అలరిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మరో వివాదంతో హెడ్ లైన్స్ లోకి వచ్చింది. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచింది.

తాజా ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో ఉర్ఫీ పంజాబీ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి తనతో వీడియో సెక్స్ చేయమని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.  తన సోదరితో కలిసి అతడు పరిశ్రమలో పని చేసాడని కూడా వెల్లడించింది.  ఈ ఫిర్యాదుతో పాటు వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ లను షేర్ చేసింది. వాటి ప్రకారం ఉర్ఫీని అతడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. తనతో వీడియో సెక్స్ చేయకపోతే పాత వీడియోను విడుదల చేస్తానని అతడు తనను బెదిరిస్తున్నాడని ఉర్ఫీ చెబుతోంది. అయితే ఆ పాత వీడియో కూడా ఫేక్..

మార్ఫింగ్ చేసిన వీడియో అని దీని గురించి రెండేళ్ల క్రితం తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని ఉర్ఫీ జావేద్ పేర్కొంది. రేప్ బెదిరింపులకు పాల్పడే అతడు సమాజానికి ముప్పు అని చెబుతూ.. ఉర్ఫీ జావేద్ తాను ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేసింది. అయితే దాదాపు 15 రోజులు అయినా ముంబై పోలీసులు ఇంకా ఎటువంటి చర్య తీసుకోలేదని వెల్లడించింది.

ఉర్ఫీ తాజా ఫిర్యాదు ఇప్పుడు చాలా వైరల్ గా మారడంతో పోలీసులు చర్య తీసుకొని చేయాల్సినది చేస్తారు. ఆ వ్యక్తి పరిశ్రమకు చెందినవాడు.  నటుడిగా కనిపిస్తున్న అతడి ఫోటోలను కూడా ఉర్ఫీ జావేద్ షేర్ చేసింది. త్వరలోనే అతడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తారని ఉర్ఫీ అభిమానులు భావిస్తున్నారు.