మామ పవన్ కల్యాణ్ రికార్డులకే ఎసరు పెట్టాడు!

Tue Feb 23 2021 09:06:42 GMT+0530 (IST)

Uppena Movie Collections

ఉత్తరాంధ్రలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి అరుదైన బాక్సాఫీస్ రికార్డులు ఉన్న సంగతి తెలిసిందే. విశాఖ-విజయనగరం- శ్రీకాకుళంలో పవన్ కి అసాధారణ ఫాలోయింగ్ ఉంటుంది. అక్కడ వసూళ్ల రికార్డులను ఆయన ప్రతిసారీ బ్రేక్ చేస్తూనే ఉంటారు.తాజా సమాచారం ప్రకారం.. ఉత్తరాంధ్రలో పవన్ బెస్ట్ కలెక్షన్ల రికార్డును ఉప్పెన  అధిగమించిందని ట్రేడ్ లో టాక్ వినిపిస్తోంది. మామ పవన్ నే మేనల్లుడు టార్గెట్ చేసి కొత్త రికార్డ్ ను అందుకున్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక డెబ్యూ హీరో ఫీట్ అసాధారణమైనది అన్న చర్చా సాగుతోంది.

ఉప్పెన రెండో సోమవారం అద్భుత వసూళ్లను సాధించి  రెండో వారంలోనూ ఈ ఏరియాలో బలంగా ఉంది. మునుముందు చక్కని వసూళ్లు తెస్తుందన్న అంచనా ఏర్పడింది. 2012లో పవన్ నటించిన గబ్బర్ సింగ్.. 2013లో అత్తారింటికి దారేది సంచలన విజయాలు సాధించాయి. ఆ సినిమాల రికార్డుల్ని కొట్టాడంటే వైష్ణవ్ తేజ్ ఉప్పెన కంటెంట్ అంత గొప్పగా నచ్చిందనే అర్థం. తెలుగు రాష్ట్రాల నుంచి తొలి పరిచయ చిత్రంతోనే 50 కోట్ల క్లబ్ హీరోగా సంచలనాలు సృష్టిస్తున్నాడు వైష్ణవ్. చరణ్ .. అఖిల్ డెబ్యూ రికార్డుల్ని ఇప్పటికే అధిగమించాడు. అన్న సాయి ధరమ్ తేజ్ కంటే బెటర్ డెబ్యూ అన్న పేరు తెచ్చుకున్నాడు. అది కూడా క్రైసిస్ సమయంలో ఈ రిజల్ట్ ఆశ్చర్యపరుస్తోంది.