మనసులో మాట బయటపెట్టిన ఉప్పెన బ్యూటీ!

Mon May 03 2021 22:00:01 GMT+0530 (IST)

Uppena Beauty who revealed the word in mind!

సినీ ఇండస్ట్రీలో డెబ్యూ మూవీతో ఇంపాక్ట్ క్రియేట్ చేసే హీరోయిన్స్ అరుదుగా కనిపిస్తుంటారు. అదే కోవకు చెందుతుంది 'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి. ఈ యంగ్ హీరోయిన్ ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది. మొదటి సినిమాలోనే అదిరిపోయే నటన కనబరిచేసరికి ఇంకా ముందుముందు ఫ్యూచర్ సినిమాల్లో అమ్మడు ఏ రేంజిలో పెర్ఫార్మన్స్ చేస్తుందో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన హీరోయిన్ సినిమాలకు ముఖ్యంగా యువత థియేటర్లకు పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తారు. క్యూట్ మాటలతో.. అంతకన్నా క్యూట్ హావభావాలతో అలా తెలుగు సినీ ప్రేక్షకుల మనసు దోచుకుంది కృతిశెట్టి.ఈ కుర్రభామ వచ్చిరాగానే క్రేజీ సినిమాలను లైన్ లో పెట్టేసింది. అయితే ఇప్పుడు చేయబోయే ఉప్పెన బేబమ్మ పాత్రకు పూర్తి విరుద్ధంగా ఉంటాయని టాక్. నేచురల్ స్టార్ నానితో పీరియడిక్ మూవీ 'శ్యామ్ సింగరాయ్'లో నటిస్తున్న కృతి.. అదేవిధంగా సుధీర్ బాబు సరసన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమా కూడా ఓకే చేసింది. వీటితో పాటు ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన కూడా ఓ మాస్ కమర్షియల్ సినిమా చేస్తోంది. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాతో అమ్మడు కోలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతుంది.

ఇదిలా ఉండగా.. కృతిశెట్టి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్. ఎప్పటికప్పుడు వయ్యారి అభిమానులతో టచ్ లో ఉండేందుకు ట్రై చేస్తుంటుంది. తాజాగా కృతి ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. అందులో భాగంగానే కృతిని ఓ ఫ్యాన్.. 'మీరు మాట్లాడే తెలుగు చాలా బాగుంటుంది. ఫ్యూచర్ సినిమాల్లో ఓన్ డబ్బింగ్ చెప్తారా..?' అని అడిగాడు. దానికి సమాధానంగా కృతిశెట్టి.. 'నాకు కూడా ఓన్ డబ్బింగ్ చెప్పాలనే ఉంది. చూడాలి మరి' అంటూ మనసులోని మాటను బయటపెట్టింది. ప్రస్తుతం వయ్యారి చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.