మెగా ప్రయత్నాల్లో ఉపేంద్ర..చిరుకే సర్ ప్రైజ్!

Tue Jun 28 2022 16:14:21 GMT+0530 (IST)

Upendra to Direct Chiranjeevi

కన్నడ నటుడు ఉపేంద్ర టాలీవుడ్ లో ఎంత ఫేమస్ నటుడో? చెప్పాల్సిన పనిలేదు. తనదైన శైలి నటన..మ్యానరిజమ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఉపేంద్రకంటూ ప్రత్యేకమైన అభిమానులు..అభిమాన సంఘాలు సైతం ఏర్పాడయ్యాంటే  టాలీవుడ్ లో ఎంతగా వెలిగిపోయారో అద్దం పడుతుంది. ఇక ఉపేంద్ర స్వీయా దర్శకత్వంలో ఎన్నో సినిమాలొచ్చాయి.అతను ఎంత గొప్ప నటుడో..అంతకు మించి దర్శకుడు..రచయిత కూడా. కన్నడలో బిజీ డైరెక్టర్లలో ఆయన ఒకరు. అంత బిజీగా  ఉన్న తెలుగు సినిమాలో ఆఫర్ వస్తే మాత్రం తప్పక నటిస్తారు.  తెలుగు ప్రేక్షకులపై  ఉన్న అభిమానంతో ఎలాంటి రోల్ చేయడానికైనా సిద్దంగా ఉంటానని ఎప్పడికప్పుడు చెబుతుంటారు. అంతటి ప్రతిభావంతుడు కాబట్టే  సరిగ్గా రెండు దశాబ్ధాల క్రితం మెగాస్టార్ చిరంజీవిని సైతం డైరెక్ట్ చేసే అరుదైన అవకాశం వచ్చింది.

కానీ ఉపేంద్ర వ్యక్తిగత కారణాలుగా అప్పట్లో ఆ ఛాన్స్ వదులుకోవాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో  ఉపేంద్ర రాజశేఖర్ హీరోగా..ప్రేమ హీరోయిన్ గా 'ఓంకారం' అనే సినిమా తెలుగులోనే  తెరకెక్కిస్తున్నారు. కన్నడ 'ఓమ్' కి రీమేక్ అది.  ఆ సినిమా సెట్స్ లో ఉండగానే చిరంజీవితో ఛాన్స్ వచ్చింది. కానీ అంత గొప్ప స్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్  కోల్పోయారు. అందుకు ఉపేంద్ర ఎంతో బాధపడ్డారు.  సందర్భం వచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఆ విషయాన్ని గుర్తు చేస్తుంటారు.

ఆ తర్వాత చిరంజీవి మళ్లీ అవకాశం ఇవ్వలేదు. ఉపేంద్ర కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. అయితే తాజా సమాచారం మేరకు ఉపేంద్ర మెగాస్టార్ ని ఇంప్రెస్ చేసే స్ర్కిప్ట్ సిద్దం చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. మెగాస్టార్ ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా..ఉపేంద్ర శైలి కథ..కథనాలతో నేటి జనరేషన్ కి మ్యాచ్ అయ్యే పక్కా కమర్శియల్ కథని సిద్దం చేసినట్లు సమాచరం.

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవిని కలిసే ప్రయత్నాలు కూడా చేస్తున్నరని  గుసగుస వినిపిస్తుంది. నేరుగా  మెగా కాంపౌండ్..అక్కడి సన్నిహితుల  నుంచే ఈ విషయం లీకైంది.  ఉపేంద్ర ..చిరంజీవీ అప్పాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారని...తెలిసిన సన్నిహితుల ద్వారా టచ్ లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి అసలు సంగతేంటి? అన్నది ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే గానీ  తెలియదు.

ప్రస్తుతం చిరంజీవి 'గాడ్ ఫాదర్'...'వాల్దేరు వీరయ్య'.. 'భోళా శంకర్' చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే మెగా 154 పేరుతో మరో చిత్రాన్ని కూడా ప్రకటించి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఉపేంద్ర తో సినిమా చేయాలంటే చిరు ఇవన్నీ పూర్తి చేయాలి. అప్పుడు వీలుపడేది. ఇక ఉ పేంద్ర నటుడిగా...దర్శకుడిగా కన్నడలో చాలా సినిమాలతో బిజీగా ఉన్నారు.