మహేష్ కు తండ్రిగా స్టార్ హీరో?

Wed Jul 06 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Upendra father character in SSMB28 movie

సూపర్ స్టార్ మహేష్ రెండేళ్ల విరామం తరువాత `సర్కారు వారి పాట` మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. బారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఆశించిన ఫ్యాన్స్ కి ఈ మూవీ తీవ్ర నిరాశని కలిగించి యావరేజ్ హిట్ మూవీగా నిలిచింది. దీంతో ఫ్యాన్స్ తమ ఆశలన్నీ త్రివిక్రమ్ తో మహేష్ చేనున్న 28వ ప్రాజెక్ట్ పై పెట్టుకున్నారు.హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ త్రివిక్రమ్ సన్నిహితుడు ఎస్. రాధాకృష్ణ ఈ మూవీని నిర్మించబోతున్నారు. #SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో త్వరలో సెట్స్ పైకి రానున్న ఈ మూవీ కోసం మహేష్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కారణం దాదాపు 12 ఏళ్ల విరామం తరువాత త్రివిక్రమ్ తో కలిసి మహేష్ చేయనున్న మూవీ ఇది. దీంతో మేకర్స్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ మూవీని ప్రత్యేకంగా చూస్తున్నారు.

ఫ్యాన్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? అని ఆరా తీస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ మూవీలో హీరో నాని కీలక పాత్రలో నటిస్తాడని ప్రచారం జరిగింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తేలడంతో తాజాగా మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవలే త్రివిక్రమ్ వెకేషన్ కోసం జర్మనీలో వున్న మహేష్ కు ఫైనల్ వెర్షన్ వినిపించి ఓకే అనిపించుకున్నారట.

మహేష్ రీసెంట్ గా హైదరాబాద్ తిరిగి రావడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో సాగుతోందని జూలైలోనే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళుతున్నారట.

ఇప్పటికే స్క్రీప్ట్ డైలాగ్ వెర్షన్ తో సహా లాక్ అయిపోవడంతో నటీనటుల ఎంపికని మొదలు పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా మహేష్ కు ఫాదర్ గా ఓ స్టార్ హీరోని ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ని ఈ పాత్ర కోసం త్రివిక్రమ్ సంప్రదించారని ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.  

మహేష్ కు ఏడేళ్లు మాత్రమే పెద్దవాడైన ఉపేంద్రని తండ్రిగా త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నాడన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. అయితే ఉపేంద్ర పాత్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాత్రమే కనిపిస్తుందని చెబుతున్నారు. గతంలో త్రివిక్రమ్ రూపొందించిన `సన్నాఫ్ సత్యమూర్తి`లో ఉపేంద్ర కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు.