ఫ్యాన్ డైరెక్టర్ తో పవర్ స్టార్ పవర్ ఫుల్ అప్ డేట్ ఇచ్చేశాడు

Sun Dec 04 2022 11:03:34 GMT+0530 (India Standard Time)

Latest Updates On Pawan Kalyan New Movie

ఊహించినట్టుగానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి బ్రేకింగ్ అప్ డేట్ వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కార్యకలాపాల్లో భాగంగా గత కొంత కాలంగా సినిమాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. గత మూడు నాలుగు నెలలుగా ఏపీ రాజకీయాలకే పూర్తి టైమ్ ని కేటాయిస్తూ వస్తున్నారు. దీంతో పవన్ అంగీకరించిన ప్రాజెక్ట్ ల పరిస్థితి ఏంటీ?.. ముందుకు వెళ్లేదెప్పుడు?..పవన్ అంగీకరించిన సినిమాల్లో చాలా వరకు ఆగిపోయినట్టేనా? అనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి.దీనికి తోడు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో చేయాలనుకున్న భవదీయుడు భగత్ సింగ్ ఇన కూడా పక్కన పెట్టారంటూ వార్తలు వినిపిస్తుండటం.. ఈ ప్రాజెక్ట్ స్థానంలో తేరి రీమేక్ కథకు మార్పులు చేయమంటూ హరీష్ శంకర్ కు బాధ్యతల్ని పవన్ అప్పగించాడని ప్రచారం మొదలవడం.. అంతే కాకుండా సముద్రఖనితో చేయాలనుకున్న వినోదాయ సితం కూడా ఆగిపోయిందని ఇండస్ట్రీలో ప్రచారం మొదలైంది.

దీంతో పవన్ నుంచి ఇక కొత్త సినిమాలు ఇప్పట్లో కష్టమేనా అనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో పవన్ కల్యాణ్ అభిమానుల్లోనూ ఆందోళన మొదలైంది. ప్రకటించిన సినిమాలు ఎప్పుడు సెట్స్ కు వెళతాయో తెలియని అయోమయం నెలకొనడంతో పవన్ స్టార్ ఇకపై రాజకీయాలపై అథిక ప్రధాన్యత ఇచ్చేలా వున్నాడనే భావన అభిమానుల్లో వినిపించడం మొతలైంది. అయితే వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ పవన్ కల్యాణ్ నుంచి ఆదివారం పవర్ ఫుల్ అప్ డేట్  వచ్చేసింది. అప్ డేట్ తో పాటు పవర్ ఫుల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.

బ్యాగ్రౌండ్ రెడ్ కలర్ లో వుండగా.. ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ చేతులు కట్టుకుని కనిపిస్తున్న పవన్ స్టిల్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. They Cll Hime OG అంటూ క్యాప్షన్ మరింతగా ఆకట్టుకుంటోంది. ఊహించినట్టుగానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పవర్ ఫుల్ మూవీని చేయబోతున్నామంటూ RRR ఫేమ్ డీవీవీ దానయ్య డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి అధికారికంగా అప్ డేట్ ఇచ్చేశారు.

తమిళంలో విజయ్ నటించిన తేరి మూవీని పవన్ కల్యాణ్ హీరోగా సాహో ఫేమ్ సుజీత్ డైరెక్టర్ గా రీమేక్ చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ఆదివారం డీవీవీ దానయ్య అధికారికంగా ప్రకటించారు.

గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ టైమ్ లో ఓ థియేటర్ లో తలకు రెడ్ కలర్ టవల్ కట్టుకుని ఓ అభిమానిలా సుజీత్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అలాంటి అభిమాని పవన్ తో కలిసి సినిమా చేయబోతుండటంతో ఆనాటి విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ అభిమాని డైరెక్టర్ గా మారితో ఫ్యాన్స్ కి పూనకాలేనని నెట్టంట ట్రెండ్ చేస్తున్నారు. రవికె. చంద్రన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ మూవీకి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిచనున్నాడని తెలుస్తోంది.