అఖిల్ 'ఏజెంట్' పరిస్థితేంటీ..ఏం జరుగుతోంది?

Tue Dec 06 2022 12:17:05 GMT+0530 (India Standard Time)

Latest Updates On Akhil 'AGENT' Movie

టాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్ట్ లు ఎందుకు రాకెట్ స్పీడుతో పూర్తవుతున్నాయో.. కొన్ని మాత్రం ఎంతుకు ఇప్పటికీ డిలే అవుతున్నాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. కొన్నింటి విషయంలో మాత్రం కొంత మంది వ్యక్తుల ఇతర కమిట్ మెంట్ ల కారణంగా డిలే అవుతుంటే కొన్ని మాత్రం కొందరి అలసత్వం కారణంగానే డిలే అవుతున్నాయని తెలుస్తోంది.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడిక్ ఫిక్షనల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ `హరి హర వీరమల్లు`. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పవన్ కల్యాణ్ పొలిటికల్ కమిట్ మెంట్ ల కారణంగా డిలే అవుతూ వస్తోంది.

అయితే యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న `ఏజెంట్` మాత్రం మరో కారణంగా డిలే అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..`అఖిల్` వంటి డిజాస్టర్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ నాలుగవ సినిమా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` మూవీతో తొలి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే కమర్షియల్ బ్లాక్ బస్టర్ ని పాన్ ఇండియా హిట్ ని సొంతం చేసుకుని హీరోగా స్టార్ డమ్ ని సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో అఖిల్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ `ఏజెంట్`.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీకి స్టైలిష్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక అతిథి పాత్రలో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ గత కొన్ని నెలలుగా నత్తనడకన సాగుతోంది. ముందు ఆగస్టు 12 రిలీజ్ అన్నారు. షూటింగ్ లో హెవీ స్టంట్స్ కారణంగా అఖిల్ గాయాలు కావడంతో షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. దీంతో ఈ రీలీజ్ డేట్ ని మార్చేసి సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించారు.

అప్పటి నుంచి ఇంత వరకు ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ లేదు. ఇంతకీ షూటింగ్ జరుగతోందా?.. జరగడం లేదా..? అనే విషయాల్లో ఎలాంటి క్లారిటీ లేదు. దర్శకుడు సురేందర్ రెడ్డి లేట్ చేస్తూ ప్రాజెక్ట్ ని మరింత ఆలస్యం చేస్తున్నారా? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

సురేందర్ రెడ్డిది స్లో అండ్ స్టడీ నేచర్.. చాలా లేజీగా సినిమాలు పూర్తి చేస్తుంటారు అనే టాక్ ఇండస్ట్రీలో వుంది. ఆ నేచరే ఇప్పడు `ఏజెంట్` ని మరింత ఆలస్యం అయ్యేలా చేస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన వల్లే సినిమా ఎంతకీ ముందుకు వెళ్లడం లేదని బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయట.