Begin typing your search above and press return to search.

ఆ భ‌యం వ‌ల్లే కొర‌టాల చివ‌రి నిమిషంలో రాన‌న్నాడా?

By:  Tupaki Desk   |   4 Dec 2022 12:30 PM GMT
ఆ భ‌యం వ‌ల్లే కొర‌టాల చివ‌రి నిమిషంలో రాన‌న్నాడా?
X
స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ మ‌ళ్లీ `ఆచార్య‌` కార‌ణంగా వార్త‌ల్లో నిలుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ల తొలి కాంబినేష‌న్ లో అత్యంత భారీగా తెర‌కెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ గా నిలిచి షాకిచ్చిన విష‌యం తెలిసిందే.

ఈ మూవీ రిలీజ్ త‌రువాత నెట్టింట ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ట్రోలింగ్ కి గురి అయ్యాడు. త‌న వ‌ల్లే ఈ సినిమా డిజాస్ట‌ర్ అయిందని మెగా ఫ్యాన్స్ మండిప‌డ్డారు కూడా. ఆ త‌రువాత అభిమానుల అనుమానాల్ని నిజం చేస్తూ చిరంజీవి స్పందించ‌డం తెలిసిందే.

ఆ త‌రువాత రామ్ చ‌ర‌ణ్‌, సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ కూడా ఇండైరెక్ట్ గా కొర‌టాల శివ‌దే త‌ప్ప‌ని, అత‌ని వ‌ల్లే `ఆచార్య‌` డిజాస్ట‌ర్ అయింద‌ని స్ప‌ష్టం చేయ‌డంతో అంద‌రి క‌ళ్లు ఇప్ప‌డు కొర‌టాల శివ వైపు చూడ‌టం మొద‌లు పెట్టాయి. ఈ వ‌రుస వ్యాఖ్య‌ల‌పై కొర‌టాల ఎలా స్పందించ‌బోతున్నాడు? .. ఎలాంటి రిప్లై ఇవ్వ‌బోతున్నాడు? అనే ఆస‌క్తి అంద‌రిలోనూ మొద‌లైంది. అయితే కొర‌టాల మాత్రం మీడియా ముందుకు రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ 30వ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులలో బిజీ బిజీగా గ‌డిపేస్తున్న కొర‌టాల శివ బ‌య‌టి విష‌యాల‌ని అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. రీసెంట్ గా సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు, ప్రాజెక్ట్ డిజైన‌ర్ సాబు సిరిల్ తో క‌లిసి చ‌ర్చిస్తున్న ఫొటోల‌ని అభిమానుల‌తో మైత్రీ వారు పంచుకున్న విష‌యం తెలిసిందే.

ఇదిలా వుంటే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌ని ఆదివారం జ‌రిగే ఓ సినిమా ఈవెంట్ కి ప్ర‌త్యేకంగా ఆహ్యానించార‌ట‌. ముందు వ‌స్తాన‌ని మాటిచ్చిన కొర‌టాల ఆ త‌రువాత చివ‌రి నిమిషంలో ఈవెంట్ కి హాజ‌రు కాన‌ని చెప్ప‌డం ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

`ఆచార్య‌` భ‌యం వ‌ల్లే కొర‌టాల ఈవెంట్ కి చివ‌రి నిమిషంలో రాన‌న‌ని చెప్పాడా? అన్న‌ది ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఫ్లాప్ లు ఎంత మంది ద‌ర్శ‌కుల‌కు వ‌చ్చినా స‌రే వాటిని అధిగ‌మించి ముందుకు సాగుతుంటారు... అయితే `ఆచార్య‌` డిజాస్ట‌ర్ కార‌ణంగా ఈ మ‌ధ్య కాలంలో ఏ ద‌ర్శ‌కుడు ఎదుర్కొని విమ‌ర్శ‌ల‌ని కొర‌టాల ఎదుర్కొన్నారు. వాటిపై ఆదివారం జ‌ర‌గ‌నున్న ఓ ఈవెంట్ లో వివ‌ర‌ణ ఇస్తార‌ని అంతా ఆశించారు. కానీ కొర‌టాల మాత్రం ఆ భ‌యం వ‌ల్లే చివ‌రి నిమిషంలో ఈవెంట్ కి హాజ‌రు కాన‌ని చెప్ప‌డం ఏంట‌ని అంతా వాపోతున్నారు.