గెట్ రెడీ ఫోక్స్ అంటున్న వెంకటేష్

Tue Jan 24 2023 12:06:44 GMT+0530 (India Standard Time)

Update on Venky 75th Film

విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలు తీస్తూ వెళ్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అసురన్ రీమేక్ నారప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్.. ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత ఆయన ఎఫ్ 3 అనే సినిమా కూడా చేశాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక విక్టరీ వెంకటేష్ కెరియర్ లో 75వ సినిమా కావడంతో భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. వెంకటేశ్ హీరోగా రానున్న తర్వాతి చిత్రం శైలేశ్ కొలను దర్శకత్వం వహించనున్నాడు.నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా... వెంకటేశ్ తో చెయబోయే.. ప్రొడక్షన్ నెంబర్ 2 ప్రతిష్ఠాత్మకమైనదని సోమవారం నిహారిక ఎంటర్టైన్ మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

జనవరి 25న ఈ సినిమాకు సంబంధించి.. మరో ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి గెట్ రెడీ ఫోక్స్ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్లో వెంకటేష్ ఫేస్ కనబడకుండా నిలబడి ఉన్నాడు.  

జనవరి 25న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు వీడియో గ్లింప్స్ ఉంటున్నట్లు ప్రకటించారు. దీన్ని చూసిన అభిమానులు... మరో సూపర్ హిట్ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇక గత ఏడాది విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా చిత్రంలో వెంకటేశ్ కీలకపాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.  వెంకటేశ్ తన 75వ సినిమా కావడంతో అన్ని సెట్ చేసుకుని హిట్ కొట్టాలని చూస్తున్నారని సమాచారం.

ఓ వైపు ఫ్యామిలీ ఆడియేన్స్ కూడా వెంకీమామ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. శ్యామ్ సింగరాయ్ తర్వాత ప్రొడక్షన్ నంబర్ 2గా వెంకటేశ్ తో రాబోతున్న కొత్త సినిమాను నిహారిక ఎంటర్టైన్ మెంట్ నిర్మాణం చేస్తోంది.

ఈ మేరకు అఫీషియల్ ఖాతాలో ట్వీట్ కూడా చేసింది. ఇక శైలేశ్ కొలను ఇటీవల హిట్ సినిమాల సిరిస్తో హిట్లు అందుకున్న విషయం తెలిసిందే. మరి ఆయన వెంకటేశ్తో కలిసి మరో హిట్ మూవీ తీస్తాడో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.