బిగ్ బాస్ 6 : చంటిని అంత మాట అనేసిన గీతూ

Fri Sep 30 2022 11:44:04 GMT+0530 (India Standard Time)

Update on Telugu Bigg Boss Season 6

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నాల్గవ వారం ముగింపు దశకు చేరుకుంది. రెండు రోజుల పాటు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ వివిధ లెవల్స్ లో జరిగాయి. ఫైనల్ గా కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచిన వారిలోంచి కొందరిని ఎంపిక చేసే పక్రియ జరిగింది. ఆసమయంలో జరిగిన రచ్చ మామూలుగా లేదు. కంటెస్టెంట్స్ మధ్య వాదోపవాదాలు జరిగిన తీరు అందరికి షాకింగ్ గా అనిపించింది.ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్ లో రేవంత్ భార్య యొక్క శ్రీమంతం వీడియో మరియు ఫోటోలు అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా పంచ్ కొట్టు కూడా ఆకట్టుకుంది. రేవంత్ భార్య అన్విత యొక్క శ్రీమంత ఫోటోలను బిగ్ బాస్ ప్రదర్శించాడు. గత వారం అన్విత యొక్క శ్రీమంతం ను కుటుంబ సభ్యులు నిర్వహించారని బిగ్ బాస్ తెలియజేశాడు.

ఆ సమయంలో రేవంత్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇతర కంటెస్టెంట్స్ రేవంత్ ను మరియు అన్విత ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీమంతం సందర్భంగా రేవంత్ స్వీట్లు పంచి తన ఆనందంను షేర్ చేసుకున్నాడు. హౌస్ లో ఆ మూమెంట్ చాలా చక్కగా అనిపించింది. అంతలోనే మళ్లీ రచ్చ మొదలు అయ్యింది.

కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా కంటెండర్స్ యొక్క ఫోటోలు ఉన్నాయి. వాటిల్లో ఎవరు అంటే తమకు ఇష్టం లేదు.. కెప్టెన్సీ కి అనర్హులు అనుకుంటున్నారో వారి ఫోటోను పంచ్ ఇచ్చి చించేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో రాజశేఖర్ ని రేవంత్... వాసంతిని ఆర్ జే సూర్య... అర్జున్ కళ్యాణ్ ని ఆది రెడ్డి... ఫైమా ని బాలాదిత్య... గీతూ రాయల్ ని చంటి అనర్షులుగా పేర్కొన్నారు.

గీతూ రాయల్ గేమ్ సరిగా ఆడటం లేదని ఆమె పద్దతి సరిగా ఉండదు అంటూ చంటి ఆమె కెప్టెన్ గా అనర్హురాలు అని చంటి పంచ్ ఇచ్చాడు. అప్పుడు గీతూ గేమ్ ఆడరాని వారు.. గేమ్ ఆడని వారు నా గేమ్ గురించి మాట్లాడుతున్నారు అంటూ గీతూ నిర్లక్ష్యంగా మాట్లాడటంతో వివాదం చాలా సీరియస్ గా సాగింది.

శ్రీహాన్ వర్సెస్ ఇనాయా సుల్తానా ఏజ్ ఇష్యూ...

ఇటీవల నామినేషన్ సమయంలో మరియు అంతకు ముందు టాస్క్ సమయంలో కూడా ఇనాయా మరియు శ్రీహాన్ యొక్క వయసు గురించి చర్చ జరిగింది. శ్రీహాన్ తాను చిన్నవాడిని అంటూ వ్యాఖ్యలు చేశాడు. దాంతో నా వయసు నీ కంటే పెద్ద అని ఎలా అంటావు అంటూ ఇనాయా ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఇంతకు ఇద్దరిలో ఎవరు పెద్ద ఎవరు చిన్నా అనే విషయం తెలుసుకోవాలని నెటిజన్స్ తెగ గూగుల్ మీద పడ్డారు. గూగుల్ చెబుతున్నదాని ప్రకారం శ్రీహాన్ బుడ్డోడు ఏం కాదు.. ఇనాయా కంటే ఆరు సంవత్సరాలు పెద్ద. ఇనాయా అన్నట్లుగా కాస్త ఎక్కువ పర్సనాలిటీ ఉన్న కారణంగా ఎక్కువ వయసు అమ్మాయిగా కనిపిస్తుంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.