బిగ్ బాస్ 6 : ఈ వారం ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్.. చివరి మూడు స్థానాల్లో వాళ్లే!

Sat Oct 01 2022 10:36:31 GMT+0530 (India Standard Time)

Update on Telugu Bigg Boss Eliminations

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నాల్గవ వారం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం హౌస్ లో ఉన్న వారిలో సగానికి పైగా నామినేట్ అయ్యారు. పది మంది ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అవ్వడంతో ప్రేక్షకులు ఎవరిని ఎంపిక చేసుకోవాలో కాస్త కన్ఫ్యూజ్ కంగారు పడ్డట్లుగానే అనిపిస్తుంది.గత మూడు వారాలుగా కూడా సింగర్ రేవంత్ నామినేషన్ లోకి వస్తే ఓటింగ్ లో నెం.1 గా ఉంటున్నాడు. ఈ వారం కూడా ఆయన డామినేషన్ కొనసాగింది. మధ్యలో కాస్త బ్యాక్ అయినా శుక్రవారం లైన్స్ ముగిసే సమయానికి రేవంత్ కి నెం.1 దక్కినట్లుగా సమాచారం అందుతోంది. అనూహ్యంగా నెం.2 స్థానంలో కీర్తి భట్ నిలవడం అందరిని ఆశ్చర్యపరిచే విషయం.

మొత్తం పోల్ అయిన ఓట్లలో రేవంత్ మరియు కీర్తి భట్ లకే 55 నుండి 60 శాతం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక తర్వాత స్థానల్లో ఉన్న వారి విషయానికి వస్తే మూడు నాలుగు అయిదు స్థానాల్లో శ్రీహాన్.. ఇనాయా సుల్తానా.. సూర్య లు కాస్త అటు ఇటుగా ఉన్నారట. ఆరు ఏడు స్థానాలను గీతూ రాయల్.. అర్జున్ కళ్యాణ్ లు దక్కించుకున్నారట.

గత వారంలో గీతూ రాయల్ నామినేషన్ లో ఉన్న సమయంలో మంచి ఓట్లు పడ్డాయి. కానీ ఈసారి మాత్రం ఆమెకు చాలా తక్కువ ఓట్లు నమోదు అయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఆమె అతి ప్రవర్తనకు కొందరు అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఆమెకు ఓట్లు తగ్గి ఉంటాయి అనేది బిగ్ బాస్ విశ్లేషకుల యొక్క అభిప్రాయం.

ఇక చివరి మూడు స్థానాల్లో ఉన్న వారి విషయానికి వస్తే.. రాజశేఖర్.. ఆరోహి రావు.. సుదీప. ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అవ్వడం దాదాపుగా కన్ఫర్మ్ అన్నట్లుగా స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ముగ్గురిలో ముగ్గురు సుదీప  పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆమె బయటకు వచ్చే సమయం వచ్చిందని కొందరు లీక్ ఇస్తున్నారు.

ఎవరు ఎలిమినేట్ అయ్యేది నేడు ఎపిసోడ్ షూట్ జరగబోతుంది కనుక మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వస్తున్న వార్తలు అన్నీ కూడా పుకార్లే.. అసలు ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది ఎపిసోడ్ చూస్తే కానీ నూరు శాతం క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అయితే ఈ మధ్య లీక్ లు అయిన వాటిల్లో ఎక్కువ శాతం నిజం అయ్యింది. మరి సుదీప సర్దేసుకోవాల్సిందేనేమో పాపం.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.