మహేష్ కోసం కొత్త మేనరిజం.. త్రివిక్రమ్ సూపర్ ప్లాన్..!

Tue Jan 24 2023 11:22:34 GMT+0530 (India Standard Time)

Update on SSMB28 Movie

హ్యాట్రిక్ కాంబినేషన్ లో త్రివిక్రమ్ మహేష్ కలిసి చేస్తున్న అప్ కమింగ్ మూవీపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా విషయంలో త్రివిక్రం చాలా ఫోకస్డ్ గా టార్గెట్ మిస్ అవ్వకూడదని చూస్తున్నారు.ముందు పాన్ ఇండియా వద్దన్న మహేష్ ని ఫైనల్ కథతో ఒప్పించి సినిమాను నేషనల్ లెవెల్ ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. SSMB28 సినిమాలో మరో స్పెషల్ ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్ ఉందని తెలుస్తుంది.

అదేంటి అంటే మహేష్ ఈ సినిమాలో ఒక కొత్త మేనరిజం చూపించబోతున్నాడట. కథలో భాగంగా హీరో క్యారక్టరైజేషన్ కి ఒక మేనరిజం ఉంటుందట. అది చాలా కొత్తగా ఉంటుందని ముఖ్యంగా మహేష్ అది చేయడం వల్ల దానికి స్పెషల్ క్రేజ్ ఏర్పడుతుందని అంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో కొన్ని మేనరిజాలు వారి ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి.

మహేష్ ఇంతకుముందు తన నటనలో భాగంగా మేనరిజం చూపించాడు తప్ప క్యారక్టర్ కి కొత్త మేనరిజం ట్రై చేయలేదు. కానీ త్రివిక్రం ఈ సినిమాలో హీరో పాత్రకు సెపరేట్ మేనరిజం ప్లాన్ చేశారట. సినిమాకు అది ఎంతో ప్లస్ అవుతుంది.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది కచ్చితంగా నచ్చి తీరుతుందని అంటున్నారు.

సర్కారు వారి పాట తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో మహేష్ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేశారు. రీసెంట్ గా సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలైంది. సినిమాను ముందు ఏప్రిల్ రిలీజ్ అనుకున్నా ఇప్పుడు జూన్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఎస్.ఎస్.ఎం.బి 28వ సినిమాలో పూజా హెగ్దే శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  

ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తాడని తెలిసిందే. RRR తో ఇంటర్నేషనల్ లెవల్లో తన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకున్న రాజమౌళి మహేష్ తో చేయబోయే ప్రాజెక్ట్ హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. అదే జరిగితే ఎన్.టి.ఆర్ చరణ్ లతో పాటుగా మహేష్ కూడా హాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గరయ్యే ఛాన్స్ ఉంది.     నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.