Begin typing your search above and press return to search.

SSMB28 నుంచి ఎగ్జైటింగ్ స‌ర్ ప్రైజ్ వ‌చ్చేస్తోంది!

By:  Tupaki Desk   |   18 Aug 2022 7:33 AM GMT
SSMB28 నుంచి ఎగ్జైటింగ్ స‌ర్ ప్రైజ్ వ‌చ్చేస్తోంది!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రెండేళ్ల విరామం తరువాత 'స‌ర్కారు వారి పాట‌'తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్ లో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 ప్ల‌స్ రీల్స్‌, జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మించిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ని ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. మ‌హేష్ ఫ్యాన్స్ ని అయితే తీవ్ర స్థాయిలో నిరాశ‌కు గురిచేసింది. దీంతో అందిరి దృష్టి ఇప్పుడు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తో మ‌హేష్ చేయ‌బోతున్న SSMB28 పైనే వుంది.

హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మ ఇంచ‌బోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాల్ని కూడా రెండు నెల‌ల క్రితం లాంఛ‌నంగా పూర్తి చేశారు. ఆ త‌రువాత రిలీజ్ డేట్ ని కూడా ప్ర‌క‌టిస్తూ ఓ వీడియోని కూడా మేక‌ర్స్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించ‌నున్నీ మూవీ ఇంత వ‌ర‌కు ప‌ట్టాలెక్క‌డం లేదు. దీంతో ఫ్యాన్స్ కొంత అస‌హ‌నానికి గుర‌వుతూ మేక‌ర్స్ ని అప్ డేట్ ఇవ్వ‌మంటూ కామెంట్ లు చేస్తున్నారు.

దాదాపు 12 ఏళ్ల విరామం త‌రువాత త్రివిక్ర‌మ్ - మ‌హేష్ ల క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కుల‌తో పాటు, మ‌హేష్ ఫ్యాన్స్ లోనూ ఈ ప్రాజెక్ట్ పై ప్ర‌త్యేక ఆస‌క్తి ఏర్ప‌డింది. దీంతో మేక‌ర్స్ ఇంత వ‌ర‌కు దీనికి సంబంధించిన అప్ డేట్ ఇవ్వ‌డంలేద‌ని గ‌త కొన్ని రోజులుగా మ‌హేష్ అభిమానులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ మేక‌ర్స్ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వారికి మేక‌ర్స్ గుడ్ న్యూస్ చెప్పారు.

ఈ మూవీ ప్రొడ్యూస‌ర్ ఎస్‌. రాధాకృష్ణ కు అత్యంత స‌న్నిహితుడైన యంగ్ ప్రొడ్యూస‌ర్‌, సితారా ఎంట‌ర్ టైన్ మెంట్స్ అధినేత సూర్య దేవ‌ర నాగ‌వంశీ SSMB28 లేటెస్ట్ అప్ డేట్ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. 'SSMB28 అప్ డేట్ గురించి మీరు ఎంత‌గా ఎదురుచూస్తున్నారో .. అందు కోసం మ‌మ్మ‌ల్ని ఎంత‌గా కామెంట్ చేస్తున్నారో మాకు తెలుసు. స‌రే ఇప్ప‌డు కొంత రిలాక్స్ అవ్వండి. మ‌న సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ అంద‌రికి ఒక ఉత్తేజ‌క‌ర‌మైన స‌ర్ ప్రైజ్ ఈ రోజు సాయంత్రం రాబోతోంది' అంటూ ఫ్యాన్స్ కి స‌ర్ ప్రైజ్ ఇచ్చారు.

గురువారం సాయంత్రం SSMB28 నుంచి ఎలాంటి స‌ర్ ప్రైజ్ రాబోతోంది? .. షూటింగ్ కి సంబంధించిన స‌ర్ ప్రైజ్ ని ఇవ్వ‌బోతున్నారా? లేక కాన్సెప్ట్ పోస్ట‌ర్ ని వ‌ద‌ల బోతున్నారా?. అన్న‌ది మాత్రం ఇప్ప‌టికైతే స‌స్పెన్స్ అని తెలుస్తోంది.

పీరియాడిక‌ల్ ఫిక్ష‌న్ గా ఈ మూవీ వుంటుందని వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో గురువారం సాయంత్రం రానున్న అప్ డేట్ పై అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. ఈ మూవీకి త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా, పీఎస్ వినోద్ ఫొటోగ్ర‌ఫీ, ఏ.ఎస్‌. ప్ర‌కాష్ ఆర్ట్‌, న‌వీన్ నూలి ఎడిటింగ్ అందిస్తున్నారు.