Begin typing your search above and press return to search.

కన్ఫర్మ్.. మాస్ మహరాజ్ ది అరువు కథే !

By:  Tupaki Desk   |   19 Oct 2020 7:00 AM GMT
కన్ఫర్మ్.. మాస్ మహరాజ్ ది అరువు కథే !
X
మాస్ మహరాజ్ రవితేజ వరుస ప్లాప్ లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. హిట్టు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. రాజా ది గ్రేట్ తర్వాత మళ్లీ ఆయన హిట్టు కొట్టలేదు. ప్రస్తుతం ‘క్రాక్’ సినిమాను కంప్లీట్ చేసిన రవితేజ తాజాగా ఆయన రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మతో ఖిలాడి అనే చిత్రాన్ని చేస్తున్నాడు. రాక్షసుడు చిత్రాన్ని నిర్మించిన కోనేరు సత్యనారాయణ దీనిని కూడా నిర్మిస్తున్నారు. అయితే రమేష్ వర్మ తన కెరీర్ ఆరంభంలోనే రవితేజతో 'వీర' అనే డిజాస్టర్ మూవీ తీశాడు. అయితే రమేష్ వర్మ తన తొలి సినిమా 'రైడ్' ని కొరియన్ మూవీని కాపీ కొట్టి తీయగా.. తమిళ హిట్ ‘రాక్షసన్’ను బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘రాక్షసుడు’ గా రీమేక్ చేసి హిట్ కొట్టాడు. అయితే ఇప్పుడు రవితేజతో తీస్తున్న 'ఖిలాడి' కూడా అరువు కథేనని తెలుస్తోంది.

తమిళంలో అరవింద్ స్వామి, త్రిష జంటగా నటించిన ‘శతురంగ వేట్టై-2’ కథతోనే ఈ సినిమా తెరకెక్కనుందట. తమిళంలో కొన్నేళ్ల కిందట వచ్చిన ‘శతురంగ వేట్టై’ సూపర్ హిట్ అయ్యింది. దీనిని తెలుగులో‘బ్లఫ్ మాస్టర్’గా రీమేక్ చేశారు. ఆ తర్వాత శతురంగ వేట్టై కి సీక్వెల్ గా ‘శతురంగ వేట్టై-2’ తెరకెక్కింది. అయితే ఇది షూటింగ్ పూర్తయినా విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు రమేష్ వర్మ రవితేజ తో తీస్తున్న సినిమా.. దీనికి రీమేక్ అని తెలుస్తోంది.ఇటీవల విడుదల చేసిన ప్రి లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లలో డబ్బు కట్టలు కనిపిస్తుండటం, ‘ఖిలాడి’ అనే టైటిల్ ప్రకటించడాన్ని బట్టి ఈ సినిమా అరవింద్ స్వామి మూవీకి రీమేకేనని తెలుస్తోంది. కనీసం ఈ సినిమాతో నైనా రవితేజ కెరీర్ మళ్లీ ఊపందుకుందు కుంటుందేమో, ఈసారైనా రమేష్ వర్మ రవితేజతో హిట్ కొడతాడేమో చూడాలి.